Rajagopal Reddy | రేవంత్ వేల కోట్ల దోపిడీ చేస్తుండు.. రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తా
Rajagopal Reddy | సీఎం రేవంత్‌రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి రెచ్చిపోయారు.
- నాగార్జున కన్‌స్ట్రక్షన్స్, బీవీఎస్ఆర్, జీకేసీ అనే ఆంధ్రా కంపెనీలకే టెండర్లు ఇచ్చారు
- మాకిస్తే రూ.600 కోట్ల ప్రజాధనం మిగిలేది
- రేడియల్ రోడ్డు టెండర్‌పై సుప్రీం కోర్టుకైనా వెళ్తాం
- సీఎంపై మరోసారి రెచ్చిపోయిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
Rajagopal Reddy | త్రినేత్ర న్యూస్: సీఎం రేవంత్‌రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి రెచ్చిపోయారు.
రేవంత్ మంత్రిగా ఉన్న శాఖలోనే వేల కోట్ల దోపిడీ జరుగుతుందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. రేడియల్ రోడ్డు టెండర్లను ఆంధ్రాకు చెందిన నాగార్జున కన్‌స్ట్రక్షన్స్, బీవీఎస్ఆర్, జీకేసీ కంపెనీలకే ఇచ్చారని మండిపడ్డారు. తమ సంస్థకు ఇస్తే రూ.600 కోట్ల ప్రజాధనం మిగిలేదన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై రాహుల్‌గాంధీకి కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఈమేరకు సోమవారం ఆయన మాట్లాడారు.
తక్కువ బిడ్ చేసినప్పటికీ
న్యాయం మా వైపే ఉన్నది. రేడియల్ రోడ్డు టెండర్‌పై సుప్రీంకోర్టుకైనా వెళ్తాం. సింగరేణిలో భారీ అవినీతి జరుగుతోంది. రేవంత్ హయాంలో మూతపడే దుస్థితికి వచ్చింది. రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాల గురించి రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తా. మా సుశీ ఇన్‌ఫ్రా సంస్థ రూ.600 కోట్లు తక్కువ బిడ్ చేసినా, ఆంధ్రా కంపెనీలకు రేడియల్ రోడ్ల కాంట్రాక్టులు ఇచ్చారు. రేవంత్ రెడ్డి కార్యాలయం నుంచి మాకు ఫోన్ చేసి టెండర్ వేయొద్దని చెప్పారు. మా సంస్థకు టెండర్ ఇస్తే రూ.600 కోట్లు ప్రజాధనం మిగిలేది.
ఆ సంతకం తెచ్చిచ్చినా..
తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకునేందుకు, కమీషన్లు దండుకునేందుకే తక్కువ బిడ్ చేసిన మా సంస్థకు టెండర్ ఇవ్వలేదు. కావాలనే ఒక సంతకం సాకుతో మా టెండర్ తిరస్కరించారు. ఆ సంతకాన్ని వెంటనే తెచ్చి ఇచ్చినా తిరస్కరించారు. అందుకే వెంటనే కోర్టులో పిటిషన్ వేశాను. ప్రభుత్వం తరఫున వాళ్లు ముకుల్ రోహత్గీని నియమించుకున్నారు
కాగా ఇటీవల నల్లగొండలో నిర్వహించిన సభలో తాను సీఎం రేవంత్‌ను వ్యక్తిగతంగా ఏమనలేదని.. ప్రభుత్వానికి సూచనలు మాత్రమే ఇచ్చానన్నారు. అభివృద్ధి పనుల కోసమే రేవంత్ తో కలిసి నడుస్తున్నానన్నారు. వ్యక్తిగతంగా ఎటువంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. తాజాగా మరోసారి హాట్ కామెంట్స్ చేయడంతో రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది.
సంబంధిత వార్తలు

PM-DDKY | ధన్ ధాన్య కృషి యోజనలో తెలంగాణ జిల్లాలకు జాతీయ గుర్తింపు
అక్టోబర్ 12, 2026

CEC Gyanesh Kumar | సీఈసీపై సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి: ‘రాజీనామా చేసి అప్రూవర్‌గా మారు’.. జ్ఞానేష్ కుమార్‌కు రాహుల్ గాంధీ అల్టిమేటం
అక్టోబర్ 12, 2026

Harish Rao | కరువు కోరల్లో తెలంగాణ.. పట్టింపు లేని తనంతో కాంగ్రెస్ సర్కార్
అక్టోబర్ 12, 2026
తాజావార్తలు
- ●Gaddam Prasad | తెలంగాణ–హిరోషిమా మధ్య సహకారం పెరగాలి
- ●Harish Rao | కరువు కోరల్లో తెలంగాణ.. పట్టింపు లేని తనంతో కాంగ్రెస్ సర్కార్
- ●Acer Iconia Tab 11 5G | ఏసర్ నుంచి రెండు కొత్త 5జి ట్యాబ్లెట్లు.. ధరలు రూ.23,999 నుంచే..
- ●Meenakshi Chaudhary | టాలీవుడ్లో కొత్త కాంబో సెట్ - నితిన్ సరసన మీనాక్షి
- ●Ramchandar Rao | టైం మీరే చెప్పండి.. 10 మందిని తీసుకురండి చాలు
- ●Srikanth Daughter | టాలీవుడ్లోకి మరో వారసురాలు - టీనేజ్ లవ్‌స్టోరీతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోన్న శ్రీకాంత్ కూతురు

Gaddam Prasad | తెలంగాణ–హిరోషిమా మధ్య సహకారం పెరగాలి

Harish Rao | కరువు కోరల్లో తెలంగాణ.. పట్టింపు లేని తనంతో కాంగ్రెస్ సర్కార్
Acer Iconia Tab 11 5G | ఏసర్ నుంచి రెండు కొత్త 5జి ట్యాబ్లెట్లు.. ధరలు రూ.23,999 నుంచే..

Meenakshi Chaudhary | టాలీవుడ్లో కొత్త కాంబో సెట్ - నితిన్ సరసన మీనాక్షి



