త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Professor Posts | యూనివర్సిటీల్లో 1,523 అధ్యాపక పోస్టులు.. నేడు నోటిఫికేషన్‌

Professor Posts | త్రినేత్ర‌.న్యూస్‌: నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌. యూనివ‌ర్సిటీల్లో (Universities) 1523 అధ్యాప‌క పోస్టుల (Professor Posts) భ‌ర్తీ ప్ర‌క్రియ (Recruitment) శుక్ర‌వారం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మ‌రికొన్ని గంట‌ల్లో ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నుంది.

G

News | Published On May 15, 2026, 8.14 am IST

Professor Posts | యూనివర్సిటీల్లో 1,523 అధ్యాపక పోస్టులు.. నేడు నోటిఫికేషన్‌
Advertisement

Professor Posts | త్రినేత్ర‌.న్యూస్‌: నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌. యూనివ‌ర్సిటీల్లో (Universities) 1523 అధ్యాప‌క పోస్టుల (Professor Posts) భ‌ర్తీ ప్ర‌క్రియ (Recruitment) శుక్ర‌వారం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మ‌రికొన్ని గంట‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నుంది. మొత్తం 1523 పోస్టుల్లో రెగ్యులర్‌ 1,244, బ్యాక్‌లాగ్‌ 279 చొప్పున ఉన్నాయి. అత్యధికంగా రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్టీయూకేటీ)లో 311 ఖాళీలు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 246, శ్రీవేంకటేశ్వరలో 125, శ్రీకృష్ణదేవరాయలో 103 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహిస్తారు. అసోసియేట్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌ పోస్టులకు రాతపరీక్ష ఉండదు. ఈ నెల 18 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.

వారికి వెయిటేజీ..

ఇప్ప‌టికే వ‌ర్సిటీల్లో కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న ప‌నిచేస్తున్న‌ అధ్యాపకులకు వెయిటేజీ ఇవ్వ‌నున్నారు. ఏడాదికి 0.5 శాతం చొప్పున గరిష్ఠంగా పదేండ్ల‌ సర్వీసును పరిగణనలోకి తీసుకుంటారు. దాని ప్రాతిప‌దిక‌న‌ వెయిటేజీ మార్కులు కేటాయిస్తారు. అయితే రాతపరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన వారికి మాత్రమే అది వర్తించ‌నుంది. అదేవిధంగా ఇంటర్వ్యూలోనూ వెయిటేజీ ఉంటుంది. ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్ఠంగా 10 మార్కులు వెయిటేజీ ఇవ్వ‌నున్నారు.

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: మే 18
దరఖాస్తుల‌కు చివరి తేదీ: జూన్‌ 8
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అభ్యర్థుల ప్రాథమిక అర్హత జాబితా: జూన్‌ 22
ప్రాథమిక అర్హతపై అభ్యంతరాల స్వీకరణ: జూన్ 29 వ‌ర‌కు
స్క్రీనింగ్‌ టెస్ట్‌కు తుది అర్హత జాబితా: జూన్‌ 30
వెబ్‌సైట్‌: https://apuniversitiesrecruitment.apcfss.in

Advertisement
Advertisement