CM Revanth Reddy | మామ, అల్లుడు కలిసి రాష్ట్ర నీటి హక్కులపై మరణశాసనం రాశారు : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | కేసీఆర్, హరీశ్‌రావు కలిసి రాష్ట్ర నీటి హక్కులపై మరణశాసనం రాశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సీఎంగా సంతకాలు పెట్టి.. కృష్ణా పరివాహక ప్రాంతానికి జలసమాధి చేశారని మండిపడ్డారు.
CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : కేసీఆర్, హరీశ్‌రావు కలిసి రాష్ట్ర నీటి హక్కులపై మరణశాసనం రాశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సీఎంగా సంతకాలు పెట్టి.. కృష్ణా పరివాహక ప్రాంతానికి జలసమాధి చేశారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు.
811 టీఎంసీలు ఉన్న కృష్ణా జలాల్లో మనకు 575 టీఎంసీలు రావాలి. తెలంగాణలో 71 శాతం కృష్ణా పరివాహక ప్రాంతం ఉంది. పరివాహక ప్రాంతం ఆధారంగా వాటాలు పంపిణీ జరిగితే 575 టీఎంసీలు రావాలి. 2015 జూన్ 26 నాడు కేంద్ర జల్‌శక్తి ఆధ్వర్యంలో కేఆర్‌ఎంబీ సమావేశం జరిగింది. నాడు ఏపీకి 512 టీఎంసీలు, 299 టీఎంసీలు చాలు అని కేసీఆర్ సంతకాలు చేశారు. తెలంగాణకు 575 టీఎంసీలు రావాల్సి ఉంటే కేసీఆర్.. చంద్రబాబు ముందు సరెండర్ అయ్యారు. నాడు సంతకం చేసి రాష్ట్ర నీటి హక్కులపై కేసీఆర్ మరణశాసనం రాశారు. మామా, అల్లుడు కలిసి రాష్ట్ర నీటి హక్కులపై మరణశాసనం రాశారు. అయితే నీటి కేటాయింపులపై ప్రతి ఏడాది చర్చించేందుకు వీలు ఉండేది. కానీ కేసీఆర్ 2020 జనవరి 29న ఏపీకి శాశ్వతంగా 512 టీఎంసీలు వెళ్లేలా సంతకం చేశారు. మీరు సంతకం పెట్టడం వల్ల ఏపీకి నీటి వాటాలు వచ్చాయి. వాళ్లు ప్రాజెక్టులు కడుతున్నారు. మీ సంతకం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయి. పల్నాడు వాటర్ గ్రిడ్‌తో పాటు ప్రకాశం జిల్లాకు నీటి కేటాయింపులు జరిపారు అని రేవంత్ రెడ్డి తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bromate in Packaged Drinking Water | మనం తాగే మినరల్ వాటర్ బాటిళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలా? అసలు బిస్లెరీ వివాదం ఏంటి?
- ●RERA | ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టులకు రేరా అనుమతులు
- ●Google Trends India 2026 | ఆరోగ్యం, విహారయాత్రలపై భారతీయులకు పెరుగుతున్న ఆసక్తి.. గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్ ఇవే..
- ●CM Revanth Reddy | కృష్ణా నుంచి ఆంధ్రకు ప్రతిరోజూ 13 టీఎంసీలు
- ●Srinath Maganti | విడుదలకు ముందు ట్రోలింగ్ - ఇప్పుడు ప్రశంసలు
- ●Arunachal Karthigai Deepam | రాగి పాత్రలో అఖండ జ్యోతి.. అరుణాచల మహా దీపం వెనుక ఆసక్తికర విషయాలు!

Bromate in Packaged Drinking Water | మనం తాగే మినరల్ వాటర్ బాటిళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలా? అసలు బిస్లెరీ వివాదం ఏంటి?

RERA | ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టులకు రేరా అనుమతులు

Google Trends India 2026 | ఆరోగ్యం, విహారయాత్రలపై భారతీయులకు పెరుగుతున్న ఆసక్తి.. గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్ ఇవే..

CM Revanth Reddy | కృష్ణా నుంచి ఆంధ్రకు ప్రతిరోజూ 13 టీఎంసీలు





