Rashmika Mandanna | అల్లు అర్జున్ సినిమాలో విలన్‌గా నేషనల్ క్రష్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన విలనిజంతో ఆడియెన్స్‌ను భయపెట్టడానికి రెడీ అవుతోంది. అల్లు అర్జున్ రాకాలో రష్మిక మందన్న నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్‌లో ఇటీవలే రష్మిక జాయినైంది.
Rashmika Mandanna |హీరోయిన్లు అంటే పాటలు, గ్లామర్ కోసమే పరిమితం అనే ట్రెండ్‌ను తిరగరాస్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. కెరీర్ ఆరంభంలో గ్లామర్ , రొమాంటిక్ సినిమాల్లోనే ఎక్కువగా కనిపించింది ఈ బ్యూటీ. ది గర్ల్‌ఫ్రెండ్‌తో తన పంథా మార్చేసింది. కొత్త తరహా కథలు, పాత్రలవైపు మొగ్గుచూపుతోంది. సినిమాల కోసం హీరోలకు మించి రిస్క్‌లు తీసుకుంటోంది. యాక్షన్ రోల్స్ చేయడానికి సిద్ధమని చెబుతోంది ప్రయోగాల చేసే క్రమంలో గాయాల పాలైన తగ్గేదేలే అని అంటోంది. తాజాగా కెరీర్‌లో ఫస్ట్ టైమ్ నేషనల్ క్రష్ విలన్‌గా కనిపించబోతుంది.
అల్లు అర్జున్ హీరోగా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథతో రాకా మూవీ తెరకెక్కుతోంది. దాదాపు పదమూడు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ రిలీజ్‌కు ముందే గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ పరంగా రికార్డ్ క్రియేట్ చేసింది.
పాన్ ఇండియన్ మూవీ...
ఈ పాన్ ఇండియన్ మూవీలో దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతో పాటు రష్మిక మందన్న, జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్ కథానాయికలుగా కనిపించబోతున్నట్లు చాలా వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లను నిజం చేస్తూ రష్మిక ఇటీవలే రాకా షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం ముంబైలో జరుగుతోన్న షెడ్యూల్‌లో అల్లు అర్జున్, రష్మిక మందన్నలపై డైరెక్టర్ అట్లీ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
నెగెటివ్ షేడ్స్...
ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో రష్మిక మందన్న నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్ ప్రధానంగా చాలా డిఫరెంట్‌గా నేషనల్ క్రష్ పాత్రను దర్శకుడు అట్లీ డిజైన్ చేసినట్లు సమాచారం. అల్లు అర్జున్‌కు ధీటుగా ఆమె విలనిజం ఉంటుందని అంటున్నారు. రెగ్యులర్ హీరోయిన్లలా రొమాంటిక్ సీన్లు, డ్యూయెట్స్ ఆమె పాత్రకు ఉండవని చెబుతున్నారు. చాలా సీరియస్‌గా రాకాలో ఈ బ్యూటీ క్యారెక్టర్ సాగుతుందని సమాచారం. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ విలన్‌గా నేషనల్ క్రష్ కనిపించబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.పుష్ప, పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్, రష్మిక మందన్న కాంబినేషన్‌లో వస్తోన్న మూడో మూవీ ఇది.
వచ్చే ఏడాది చివరలో...
రాకా మూవీ వచ్చే ఏడాది చివరలో థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో రణబాలి, మైసా సినిమాలు చేస్తోంది రష్మిక మందన్న. వీటితో పాటు ఇటీవలే ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
సంబంధిత వార్తలు

Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా – రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న అల్లు అర్జున్
సెప్టెంబర్ 21, 2026

Get together | 50 ఏళ్ల తర్వాత గెట్ టూ గెదర్.. కిడ్స్‌గా మారిపోయిన వృద్ధులు.. వీడియో
సెప్టెంబర్ 20, 2026

Deepika Padukone | రెండోసారి తల్లయిన దీపికా పడుకోణ్ – పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్
సెప్టెంబర్ 19, 2026
తాజావార్తలు
- ●Bengaluru Traffic Hack | గంటకు 70 కిమీ వేగంతో దూసుకెళ్లొచ్చు.. బెంగళూరు ట్రాఫిక్‌కు చెక్ పెడుతున్న వింత వాహనం
- ●Alleti Maheshwar Reddy | మిగతా ఎమ్మెల్యేలచే కూడా రాజీనామా చేయించాలి : బీజేఎల్పీ నేత ఏలేటి
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. రూ.5 లక్షల కోట్లు ఆవిరి.. ఆందోళనకర స్థాయిలో అమ్మకాలు..
- ●Abhijeet Dipke | జ్ఞానేష్ కుమార్ అతిపెద్ద దేశద్రోహి.. ఆయన వెంటనే రాజీనామా చేయాలి : అభిజీత్ దిప్కే
- ●Harish Rao | రాహుల్జీ.. మిగతా వారితో రాజీనామా చేయించి ప్రజా తీర్పును కోరండి
- ●Danam Nagender | 'దానం' పదోసారి పోటీ..! ఈ ఉప ఎన్నిక కలిసొచ్చేనా..?

Bengaluru Traffic Hack | గంటకు 70 కిమీ వేగంతో దూసుకెళ్లొచ్చు.. బెంగళూరు ట్రాఫిక్‌కు చెక్ పెడుతున్న వింత వాహనం

Alleti Maheshwar Reddy | మిగతా ఎమ్మెల్యేలచే కూడా రాజీనామా చేయించాలి : బీజేఎల్పీ నేత ఏలేటి

Stock Markets | స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. రూ.5 లక్షల కోట్లు ఆవిరి.. ఆందోళనకర స్థాయిలో అమ్మకాలు..

Abhijeet Dipke | జ్ఞానేష్ కుమార్ అతిపెద్ద దేశద్రోహి.. ఆయన వెంటనే రాజీనామా చేయాలి : అభిజీత్ దిప్కే



