Jason Sanjay | హీరోగా దళపతి విజయ్ కొడుకు – రంగంలోకి అల్లు అర్జున్ డైరెక్టర్
దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతడి డెబ్యూ మూవీకి రాకా డైరెక్టర్ అట్లీ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నట్లు వార్తలొస్తున్నాయి. డ్యూడ్ ఫేమ్ కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను త్వరలో అఫీషియల్‌గా అనౌన్స్‌చేయబోతున్నట్లు సమాచారం.
Entertainment | Published On Oct 29, 2026, 4.34 pm IST
Jason Sanjay | తమిళనాడు సీఎం దళపతి విజయ్ (Thalapathy Vijay) తనయుడు జాసన్ సంజయ్ సిగ్మా మూవీతో దర్శకుడిగా మారాడు. సందీప్ కిషన్ హీరోగా యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన ఈ మూవీ తొమ్మిది కోట్ల లోపే వసూళ్లను దక్కించుకుంది. సిగ్మాలో డైరెక్టర్‌గా జాసన్ సంజయ్ టేకింగ్‌పై దారుణంగా విమర్శలొచ్చాయి.
హీరోగా ఎంట్రీ...
దాంతో డైరెక్షన్ ఆలోచనలను పక్కనపెట్టి యాక్టర్‌గా కెమెరా ముందుకు రాబోతున్నాడు జాసన్ . హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. జాసన్ సంజయ్ హీరో డెబ్యూ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాకు డ్యూడ్ మూవీ ఫేమ్ కీర్తిశ్వరన్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు చెబుతోన్నారు.
విజయ్‌తో అనుంబంధం...
దళపతి విజయ్‌తో ఉన్న అనుబంధం కారణంగానే జాసన్ సంజయ్‌ని హీరోగా పరిచయం చేసే బాధ్యతను అట్లీ స్వీకరించినట్లు చెబుతోన్నారు. గతంలో దళపతి విజయ్, అట్లీ కాంబినేషన్‌లో తేరి, మెర్సల్, బిగిల్ సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో అట్లీ స్టార్ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయారు.
యాభై కోట్ల బడ్జెట్...
దాదాపు యాభై కోట్ల బడ్జెట్‌తో జాసన్ సంజయ్ హీరో డెబ్యూ మూవీ తెరకెక్కుతోన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌కు చెందిన యాక్టర్లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
కమర్షియల్ హిట్...
ఓ వైపు డైరెక్టర్‌గా కొనసాగుతూనే కథాబలమున్న చిన్న సినిమాలను నిర్మిస్తోన్నారు అట్టీ. విజయ్ సేతుపతి హీరోగా అట్లీ నిర్మాణంలో రూపొందిన బత్తా మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bollywood | లొకేషన్లు, సెట్స్, మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ఏఐ ఆధారంగా సినిమా – ఫ్యామిలీ మ్యాన్ నటి కొత్త ప్రయోగం
అక్టోబర్ 29, 2026

Sai Pallavi | సాయిపల్లవికి బిగ్ టెస్ట్.. రెండు సినిమాలు హిట్ అయితేనే..!
అక్టోబర్ 28, 2026

Sreeleela | హిట్లు లేకపోయినా తగ్గేదేలే – మళ్లీ బిజీ అవుతోన్న శ్రీలీల
అక్టోబర్ 27, 2026
తాజావార్తలు
- ●Harish Rao | మల్లన్న సాగర్ కూల్చాలని కుట్రలు చేస్తున్నరా?
- ●Jairam Ramesh | సర్ అనేది మోదీ, షా కుట్ర.. సీఈసీ దీన్ని అమలు చేశారు : జైరామ్ రమేశ్
- ●Stock Markets | ఫెడ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్.. భారత మార్కెట్లలో బుల్ ర్యాలీ..
- ●Maheshkumar Goud | ఎన్ని గెలిచామన్నది కాదు.. ఎక్కడ గెలిచామన్నదే పాయింట్
- ●Maharashtra MLC Election Results | మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఫలితాలు : బీజేపీ వర్సెస్ శివసేన.. రచ్చకెక్కిన విభేదాలు
- ●Bollywood | లొకేషన్లు, సెట్స్, మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ఏఐ ఆధారంగా సినిమా - ఫ్యామిలీ మ్యాన్ నటి కొత్త ప్రయోగం

Harish Rao | మల్లన్న సాగర్ కూల్చాలని కుట్రలు చేస్తున్నరా?

Jairam Ramesh | సర్ అనేది మోదీ, షా కుట్ర.. సీఈసీ దీన్ని అమలు చేశారు : జైరామ్ రమేశ్

Stock Markets | ఫెడ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్.. భారత మార్కెట్లలో బుల్ ర్యాలీ..

Maheshkumar Goud | ఎన్ని గెలిచామన్నది కాదు.. ఎక్కడ గెలిచామన్నదే పాయింట్



