త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | ర‌ష్మిక త‌గ్గేదేలే … బాలీవుడ్ సినిమాకు నేషనల్ క్రష్ రెమ్యూన‌రేష‌న్‌ చూస్తే మైండ్ బ్లాకే!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో మోస్ట్ బిజీయోస్ట్ హీరోయిన్‌గా ర‌ష్మిక మంద‌న్న కొన‌సాగుతోంది. నేష‌న‌ల్ క్ర‌ష్ హీరోయిన్‌గా న‌టించిన హిందీ మూవీ కాక్ టెయిల్ 2 జూన్ 19న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ రొమాంటిక్ మూవీ కోసం ర‌ష్మిక తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ బాలీవుడ్‌లో వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

N

News | Published On Jun 1, 2026, 4.53 pm IST

Rashmika Mandanna | ర‌ష్మిక త‌గ్గేదేలే … బాలీవుడ్ సినిమాకు నేషనల్ క్రష్ రెమ్యూన‌రేష‌న్‌ చూస్తే మైండ్ బ్లాకే!
Advertisement

Rashmika Mandanna | సాధార‌ణంగా పెళ్లి త‌ర్వాత హీరోయిన్ల క్రేజ్ తో పాటు ఆఫ‌ర్లు త‌గ్గుతుంటాయి. కానీ నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న విష‌యంలో మాత్రం ఈ సీన్ రివ‌ర్స్‌గా క‌నిపిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పెళ్లి త‌ర్వాత ఈ అమ్మ‌డి క్రేజ్‌, ఇమేజ్ మాత్ర‌మే కాదు రెమ్యూన‌రేష‌న్ కూడా రెట్టింపు అయ్యింది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో పాటు టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయోస్ట్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది ర‌ష్మిక‌. ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్లు ఎదురుచూస్తోన్నారు.

బాలీవుడ్ మూవీ....

ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ మూవీ కాక్‌టెయిల్ 2 జూన్ 19న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న‌తో పాటు కృతి స‌న‌న్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. షాహిద్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా క‌నిపించ‌బోతున్నారు.

కృతి స‌న‌న్‌తో స‌మానంగా

ప్ర‌స్తుతం కాక్‌టెయిల్ 2 ప్ర‌మోష‌న్స్‌లో ర‌ష్మిక బిజీగా ఉంది. కాగా ఈ బాలీవుడ్ మూవీ కోసం ర‌ష్మిక తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ హాట్ టాపిక్‌గా మారింది. కాక్ టెయిల్ 2లో హీరోయిన్‌గా న‌టించినందుకు ర‌ష్మిక ప‌దిహేను కోట్లు రెమ్యూన‌రేష‌న్ తీసుకుంద‌ట‌. సీనియ‌ర్ హీరోయిన్ అయిన కృతి స‌న‌న్‌తో స‌మానంగా కూర్గ్ బ్యూటీ పారితోషికం స్వీక‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్ కాక్‌టెయిల్ 2తోనే ర‌ష్మిక అందుకున్న‌ట్లు చెబుతున్నారు. ర‌ష్మిక‌కు సౌత్‌తో పాటు బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆమె డిమాండ్ చేసినంత మొత్తాన్ని మేక‌ర్స్ అంద‌జేశార‌ట‌.

పుష్ప పార్ట్ 2

పుష్ప పార్ట్ వ‌న్ సినిమా కోసం ర‌ష్మిక కేవ‌లం రెండు కోట్లు మాత్ర‌మే రెమ్యూన‌రేష‌న్ స్వీక‌రించింద‌ట‌. ఆ మూవీ హిట్టు నుంచి పారితోషికాన్ని పెంచుకుంటూ వ‌స్తోంద‌ని అంటున్నారు. పుష్ప పార్ట్ 2 కోసం ఏకంగా ప‌ది కోట్లు డిమాండ్ చేసింద‌ట‌. ఇప్పుడు కాక్‌టెయిల్ 2 కోసం మ‌రో ఐదు కోట్లు పెంచింద‌ని స‌మాచారం. యానిమ‌ల్‌, ఛావా స‌క్సెస్‌ల‌తో బాలీవుడ్‌లో ల‌క్కీ స్టార్‌గా మారిపోయింది ర‌ష్మిక‌. అందుకే కాక్‌టెయిల్ 2 సినిమా కోసం రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో అస్స‌లు కాంప్ర‌మైజ్ కావ‌డం లేద‌ని టాక్ వినిపిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement