Rashmika Mandanna | గుడ్‌న్యూస్ చెప్పిన రష్మిక – మేము ముగ్గురమయ్యాం అంటూ పోస్ట్
రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం అంటూ ఓ యానిమేషన్ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో చూసిన నెగిజన్లు రష్మిక ప్రెగ్నెంట్ అంటూ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. పెళ్లయిన నెలకే గుడ్‌న్యూస్ వినిపించిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
Rashmika Mandanna | టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరిలో పెళ్లిపీటలు ఎక్కారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా వీరి పెళ్లి జరిగింది. పది రోజుల పాటు పెళ్లి వేడుకలను సంప్రదాయ పద్దతుల్లో జరుపుకున్నారు. విరోష్ వెడ్డింగ్ ఫొటోలు వైరల్ అయ్యాయి. లైక్స్, వ్యూస్ పరంగా సోషల్ మీడియాలో విరాట్ కోహ్లి, మెస్సీ లాంటి సెలిబ్రిటీల రికార్డులను బ్రేక్ చేశాయి. పెళ్లితో విరోష్ జోడీ క్రేజ్ రెట్టింపు అయ్యింది.
రణబాలితో బిజీ....
ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి రణబాలి అనే సినిమా చేస్తున్నారు. హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం అనంతపూర్‌లో జరుగుతోంది. విజయ్, రష్మిక కాంబినేషన్‌లో కీలక సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు.
సోషల్ మీడియాలో పోస్ట్....
ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న రష్మిక మందన్న సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం అంటూ ఓ యానిమేషన్ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది రష్మిక. ఇందులో విజయ్, రష్మికతో పాటు ఓ పొద్దుతిరుగుడు పువ్వు కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రష్మిక ప్రెగ్నెంట్ అంటూ ఆమెకు కంగ్రాట్స్ చెప్పడం మొదలుపెట్టారు. పెళ్లయిన నెలకే గుడ్‌న్యూస్ వినిపించిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
రూమర్లు నిజం కాదా...
అయితే ప్రెగ్నెన్సీ రూమర్ల నిజం కాదట. ఈ పోస్ట్ వెనుక ఉన్న అర్థం వేరేనని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. రష్మికకు సన్‌ఫ్లవర్ అంటే చాలా ఇష్టం. తన ప్రతి ఫోస్ట్‌లో సన్ ఫ్లవర్ ఎమోజీ పెడుతుంది. అంతే కాకుండా సన్‌ఫ్లవర్‌ను తన స్నేహితురాలిగా భావిస్తుంటుంది. ప్రాణం ఉన్న మనిషిలాగే ట్రీట్ చెస్తూ దానితో కబుర్లు చెబుతున్న వీడియోలను పలుమార్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సన్‌ఫ్లవర్ పేరిట ప్రత్యేకంగా రష్మికరు పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అకౌంట్‌ను ఓపెన్ చేసింది. సన్‌ఫ్లవర్ వరల్డ్‌లోకి విజయ్ కూడా వచ్చాడంటూ చెబుతూ ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం అని రష్మిక పోస్ట్ పెట్టిందని మరికొందరు నెటిజన్లు చెబుతున్నారు.
కాగా ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో రణబాలితో పాటు మైసా సినిమాలు చేస్తోంది. హిందీలో రష్మిక హీరోయిన్‌గా నటించిన కాక్ టెయిల్ 2 రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



