త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kaleshwaram water | రంగ‌నాయ‌క‌సాగ‌ర్‌కు జ‌ల‌క‌ళ‌.. ఎత్తిపోస్తున్న‌ కాళేశ్వ‌రం

Kaleshwaram water | సిద్దిపేట (Siddipet) జిల్లా చిన్న‌కోడూరు మండ‌లంలోని రంగ‌నాయ‌క సాగ‌ర్‌(Ranganayaka sagar) ను కాళేశ్వ‌ర గంగా ముద్దాడింది. ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి ఎత్తిపోత‌లు (Lifting) ప్రారంభమ‌య్యాయి. రంగనాయకసాగర్ పంప్ హౌస్ మోటార్ల నుంచి కాళేశ్వరం జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి.

S

News | Published On Apr 5, 2026, 12.39 pm IST

Kaleshwaram water | రంగ‌నాయ‌క‌సాగ‌ర్‌కు జ‌ల‌క‌ళ‌.. ఎత్తిపోస్తున్న‌ కాళేశ్వ‌రం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: కాళేశ్వ‌రం (Kaleshwaram) అంటేనే ఎప్పుడూ ఏదో ఓ వివాదం. ప్రాజెక్టు అవినీతి అటుంచితే నేడు నీళ్ల ఎత్తిపోత షురువైంది. సిద్దిపేట (Siddipet) జిల్లా చిన్న‌కోడూరు మండ‌లంలోని రంగ‌నాయ‌క సాగ‌ర్‌(Ranganayaka sagar) ను కాళేశ్వ‌ర గంగా ముద్దాడింది. ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి ఎత్తిపోత‌లు (Lifting) ప్రారంభమ‌య్యాయి. రంగనాయకసాగర్ పంప్ హౌస్ మోటార్ల నుంచి కాళేశ్వరం జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి.

రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోకి నీటి పంపింగ్ ప్రారంభం అయిన‌ట్లు బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదిక‌గా నీటి పంపింగ్ వీడియోను షేర్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన ఖర్చు వృథా అన్న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నోరు మూయించేలా గోదావ‌రి నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయ‌ని ఆ పార్టీ వివ‌రించింది. క‌ళ్ల ముందు నీళ్లు పెట్టుకొని అవిటి ఆరోప‌ణ‌లు చేయొద్ద‌ని చుర‌క‌లంటించింది.

Advertisement
Advertisement