త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Charan | నోరు జారిన రామ్ చ‌ర‌ణ్‌… బుమ్రాపై కామెంట్స్‌తో బుక్కయిన మెగా హీరో

క్రికెట‌ర్ బుమ్రా విష‌యంలో నోరు జారిన రామ్‌చ‌ర‌ణ్‌ను నెటిజ‌న్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. భోపాల్‌లో శ‌నివారం జ‌రిగిన ఈవెంట్‌లో బుమ్రాను రామ్‌చ‌ర‌ణ్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌గా పేర్కొన‌డం క్రికెట్ ఫ్యాన్స్ అత‌డిపై ఫైర్ అవుతున్నారు. త‌న త‌ప్పిదాన్ని గుర్తించిన చ‌ర‌ణ్ బుమ్రాకు క్ష‌మాప‌ణ‌లు చెబుతూ సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

N

News | Published On May 24, 2026, 11.17 am IST

Ram Charan | నోరు జారిన రామ్ చ‌ర‌ణ్‌… బుమ్రాపై కామెంట్స్‌తో బుక్కయిన మెగా హీరో
Advertisement

Ram Charan |  టీమిండియా క్రికెట‌ర్ బుమ్రా విష‌యంలో నోరు జారిన రామ్‌చ‌ర‌ణ్‌ను నెటిజ‌న్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. క్రికెట‌ర్ బుమ్రాను రామ్‌చ‌ర‌ణ్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌గా పేర్కొన‌డంతో మెగా హీరోను క్రికెట్ ఫ్యాన్స్ ఓ ఆటాడుకుంటున్నారు. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన పెద్ది మూవీ జూన్ 4న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీ ప్ర‌మోష‌న్స్‌తో చ‌ర‌ణ్ బిజీగా ఉన్నారు. పెద్ది కీ అవాజ్ పేరుతో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌లో శ‌నివారం ఓ గ్రాండ్ ఈవెంట్‌ను మేక‌ర్స్ నిర్వ‌హించారు.

ర్యాపిడ్ ఫైర్‌...

ఈ వేడుక‌లో ర్యాపిడ్ ఫైర్ పేరుతో కొంద‌రు క్రికెట‌ర్లకు సంబంధించిన ప్ర‌శ్న‌ల‌ను రామ్‌చ‌ర‌ణ్‌ను అడిగారు హోస్ట్‌. స‌చిన్‌, ధోనీ, కోహ్లి, రోహిత్ శ‌ర్మ గురించి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మెగా హీరో స‌రిగ్గానే స‌మాధానాలు చెప్పారు. కానీ బుమ్రా విష‌యంలో త‌డ‌బ‌డిపోయారు. బుమ్రా త‌న ఫేవ‌రేట్ ప్లేయ‌ర్ అని చెప్పిన‌ చ‌ర‌ణ్‌....అత‌డిని ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌గా పేర్కొన్నాడు. బుమ్రా మ‌న దేశంలో ఫుట్‌బాల్ ఆట‌ను ఎంతో ముందుకు తీసుకుపోతున్నాడంటూ రామ్‌చ‌ర‌ణ్ అన్నాడు. ఈ వీడియో క్లిప్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. క్రికెట‌ర్‌కు, ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌కు తేడా తెలియ‌దా అంటూ చ‌ర‌ణ్‌ను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. క్రికెట్ గురించి తెలియ‌కుండా మాట్లాడితే ఇలాగే ఉంటుంద‌ని విమ‌ర్శిస్తున్నారు. బుమ్రా క్రికెట్ వ‌దిలిపెట్టి ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ ఎప్పుడూ అయ్యాడు అంటూ ఫ‌న్నీగా కామెంట్లు పెడుతున్నారు.

క్ష‌మాప‌ణ‌లు...

త‌న త‌ప్పిదాన్ని గుర్తించిన చ‌ర‌ణ్ బుమ్రాకు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. "కొన్ని సార్లు నేను పేర్ల విష‌యంలో నేను క‌న్ఫ్యూజ్ అవుతుంటా. అక్క‌డి జ‌న సందోహం, హ‌డావిడి కార‌ణంగా అనుకోకుండా త‌ప్పు జ‌రిగింది. ఈ విష‌యంలో బుమ్రాకు నేను క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నా. అత‌డి ఆట‌కు నేను పెద్ద ఫ్యాన్‌ను. బుమ్రాపై నాకు ఎన‌లేని గౌర‌వ‌ముంది" అని రామ్‌చ‌ర‌ణ్ ట్వీట్ చేశారు.

భోపాల్‌ను బీహార్‌గా....

ఇదే వేడుక‌లో భోపాల్‌ను బీహార్‌గా రామ్‌చ‌ర‌ణ్ పేర్కొన‌డం కూడా విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. ఈవెంట్‌కు అటెండ్ అయిన భోపాల్ ప్ర‌జ‌ల‌కు థాంక్స్ చెప్పే క్ర‌మంలో రామ్‌చ‌ర‌ణ్ త‌డ‌బ‌డిపోయారు. బీహార్ వాసులు అంటూ పేర్కొన్నాడు. వెంట‌నే సారీ చెప్పి భోపాల్‌గా త‌న త‌ప్పును స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేశారు.

 

Advertisement
Advertisement