త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Preity Mukhundhan | విజయ్ దేవ‌ర‌కొండ‌తో స్టెప్పులేయనున్న మ‌ల‌యాళ‌ బ్యూటీ – రౌడీ జనార్దనలో స్పెషల్ సాంగ్!

క‌న్న‌ప్ప హీరోయిన్ ప్రీతి ముకుంద‌న్ తెలుగులో మ‌రో ల‌క్కీ ఛాన్స్ అందుకుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి స్టెప్పులు వేయ‌బోతుంది. రౌడీ జ‌నార్ధ‌న మూవీలో ఈ మ‌ల‌యాళ బ్యూటీ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On May 26, 2026, 1.44 pm IST

Preity Mukhundhan | విజయ్ దేవ‌ర‌కొండ‌తో స్టెప్పులేయనున్న మ‌ల‌యాళ‌ బ్యూటీ – రౌడీ జనార్దనలో స్పెషల్ సాంగ్!
Advertisement

Preity Mukhundhan | మంచు విష్ణు హీరోగా న‌టించిన క‌న్న‌ప్ప మూవీతో టాలీవుడ్‌లోకి తొలి అడుగు వేసింది మ‌ల‌యాళ బ్యూటీ ప్రీతి ముకుంద‌న్‌. క‌న్న‌ప్ప బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టిన ప్రీతి ముకుంద‌న్ త‌న గ్లామ‌ర్ త‌ళుకుల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం శ్రీకాంత్ త‌న‌యుడు రోషన్‌తో ఏమో ఏమో ఇది అనే సినిమా చేస్తోంది. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి హిట్ ఫేమ్ శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

రౌడీ బాయ్‌తో...

తాజాగా ప్రీతి ముకుంద‌న్ తెలుగులో మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ అందుకుంది. రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి స్టెప్పులేయ‌బోతుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతోన్న మూవీ రౌడీ జ‌నార్ధ‌న‌. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు రాజావారు రాణిగారు ఫేమ్ ర‌వి కిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఉత్త‌రాంధ్ర ఫోక్ సాంగ్‌...

ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో మ‌ల‌యాళ బ్యూటీ ప్రీతి ముకుంద‌న్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఉత్త‌రాంధ్ర శైలి జానప‌ద గీతాన్ని పోలి మాసీగా ఈ పాట ఉండ‌బోతుంద‌ట‌. ఈ పాట కోసం తొలుత‌ ఐటెమ్‌సాంగ్స్‌లో స్పెష‌లిస్ట్ అయిన బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించాల‌ని అనుకున్నార‌ట‌. నాచురాలిటీ మిస్స‌వుతుంద‌నే ఆలోచ‌న‌తో చివ‌ర‌కు ఈ మ‌ల‌యాళ బ్యూటీని ఎంచుకున్న‌ట్లు చెబుతున్నారు. ఈ పాట కోసం ప్రీతి ముకుంద‌న్ భారీగానే రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేసిన‌ట్లు స‌మాచారం.

డిసెంబ‌ర్‌లో...

క‌ళింగ‌ప‌ట్నానికి చెందిన జ‌నార్ద‌న అనే యువ‌కుడు రౌడీగా ఎందుకు మారాడు? క్రైమ్ వ‌ర‌ల్డ్‌లోకి అడుగుపెట్టిన అత‌డి జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింద‌నే అంశాల‌తో ఈ మూవీ రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. రౌడీ జ‌నార్ధ‌న మూవీకి క్రిస్టో జేవియ‌ర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుండ‌గా...యానిమ‌ల్ ఫేమ్ విశాల్ మిశ్రా పాట‌ల‌ను స‌మ‌కూర్చుతున్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement