త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ranveer Singh | డాన్‌-3 మూవీ వివాదం.. మౌనం వీడిన రణ్‌వీర్‌ సింగ్‌..!

Ranveer Singh | బాలీవుడ్‌లో ‘డాన్‌ 3’ సినిమా చుట్టూ నెలకొన్న వివాదం కొత్త మలుపు తీసుకుంది. మూవీ వివాదంలో నటుడు రణ్‌వీర్‌ సింగ్‌పై ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయీస్‌ (FWICE) సహాయ నిరాకరణ నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో దురంధర్‌ నటుడు స్పందించారు.

P

Entertainment | Published On May 26, 2026, 7.30 am IST

Ranveer Singh | డాన్‌-3 మూవీ వివాదం.. మౌనం వీడిన రణ్‌వీర్‌ సింగ్‌..!
Advertisement

Ranveer Singh | బాలీవుడ్‌లో ‘డాన్‌ 3’ సినిమా చుట్టూ నెలకొన్న వివాదం కొత్త మలుపు తీసుకుంది. మూవీ వివాదంలో నటుడు రణ్‌వీర్‌ సింగ్‌పై ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయీస్‌ (FWICE) సహాయ నిరాకరణ నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో దురంధర్‌ నటుడు స్పందించారు. ‘డాన్‌’ ఫ్రాంచైజీపై తనకు ఎంతో గౌరవం ఉందని, ఈ వ్యవహారంలో ఇప్పటివరకు కావాలనే మౌనం పాటించానని రణ్‌వీర్‌ పేర్కొన్నారు. ‘వృత్తిపరమైన విషయాలు, వ్యక్తిగత సంబంధాలు పరస్పర గౌరవంతో పరిష్కరించుకోవాలని నమ్ముతాను. అందుకే మీడియా ద్వారా స్పందించలేదు’ అని రణ్‌వీర్‌ ప్రకటనలో తెలిపారు. సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అంశంపై ఇకపై కూడా బహిరంగంగా మాట్లాడబోనని స్పష్టం చేశారు. ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డాన్‌ 3’ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌ నటించాల్సి ఉండగా.. షూటింగ్‌కు కొద్ది రోజుల ముందు ఆయన ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.

దీంతో నిర్మాతల సంస్థ ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ముందస్తు నిర్మాణ ఖర్చుల రూపంలో రూ.45 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంటూ పరిహారం కూడా కోరినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ వరకు చేరగా.. మధ్యవర్తిత్వ ప్రయత్నాలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నేపథ్యంలోనే ఎఫ్‌డబ్ల్యూఐసీఈ రణ్‌వీర్‌పై సహాయ నిరాకరణ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ వివాదంపై చర్చించేందుకు తాము ప్రయత్నించగా.. సరైన వేదికలోనే మాట్లాడతానంటూ రణ్‌వీర్‌ స్పందించలేదని ఆరోపించింది. మరోవైపు, పరిశ్రమ ప్రయోజనాల దృష్ట్యా చివరి నిమిషంలో సినిమాల నుంచి తప్పుకోవడం సరికాదని సంఘం వ్యాఖ్యానించింది. 2023లో ప్రకటించినప్పటి నుంచి ‘డాన్‌ 3’ పలు కారణాలతో ఆలస్యమవుతూ వస్తోంది. నటీనటుల మార్పులు, షెడ్యూల్‌ సమస్యలతో సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం రణ్‌వీర్‌ తన కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్లు బాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement
Advertisement