Allu Arjun – Ram Charan | అల్లు అర్జున్ పార్టీ – స్పెషల్ గెస్ట్‌గా రామ్‌చరణ్ – హాజరైన టాలీవుడ్ హీరోయిన్లు వీళ్లే
అల్లు శిరీష్ పెళ్లి మార్చి 6న జరుగనున్న సంగతి తెలిసిందే. కాగా తమ్ముడి పెళ్లి సందర్భంగా అల్లు అర్జున్ స్పెషల్ పార్టీ ఇచ్చాడు. శుక్రవారం జరిగిన ఈ పార్టీలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ పాల్గొన్నాడు.
Allu Arjun - Ram Charan | టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. వీరిద్దరు కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ సోదరుడు, టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ పెళ్లి నయనికతో మార్చి 6న జరుగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలుపెట్టారు. అల్లు శిరీష్ పెళ్లి సందర్భంగా అల్లు అర్జున్ తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖులకు స్పెషల్ పార్టీ ఇచ్చాడు.
రామ్‌చరణ్...
హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఫామ్ హౌజ్‌లో ఏర్పాటుచేసిన ఈ పార్టీకి మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అటెండ్ కావడం ఆసక్తికరంగా మారింది. ఒంటరిగా కాకుండా తన భార్య ఉపాసనతో కలిసి బన్నీ పార్టీకి చరణ్ హాజరయ్యారు.
కాబోయే భార్యభర్తలు అల్లు శిరీష్, నయనికలతో కలిసి బన్నీ - స్నేహా, రామ్‌చరణ్ - ఉపాసన కలిసి దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అందరూ బ్లాక్ డ్రెస్‌లోనే కనిపించారు. మెగా ఫ్యామిలీ నుంచి ఈ పార్టీలో రామ్‌చరణ్, ఉపాసనతో పాటు సుస్మిత కొణిదెల, నిహారిక, వైష్ణవ్‌తేజ్ కూడా పాల్గొన్నట్లు సమాచారం.
కృతిశెట్టి, రాశీఖన్నా...
అల్లు అర్జున్ ఇచ్చిన పార్టీకి పలువురు టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు కూడా అటెండ్ అయినట్లు సమాచారం. తేజా సజ్జా, సిద్ధు జొన్నలగడ్డ, కృతిశెట్టి, రాశీఖన్నా, నభా నటేష్, నేహా శెట్టి, సుశాంత్ కూడా బన్నీ పార్టీలో పాల్గొన్నారట.
అల్లు శిరీష్ నయనిక పెళ్లి హైదరాబాద్‌లోనే జరగనున్నట్లు సమాచారం. పెళ్లికి సంబంధించి తొలి వెడ్డింగ్ కార్డును మావయ్య మెగాస్టార్ చిరంజీవికి అందించారు అల్లు శిరీష్. కాగా అల్లు అర్జున్ పెళ్లి రోజు కూడా మార్చి 6నే కావడం గమనార్హం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



