Ram Charan | ఫ్రీడమ్ ఫైటర్‌గా రామ్‌చరణ్ – మంచు మనోజ్ సినిమాలో గెస్ట్ రోల్
Ram Charan | మంచు మనోజ్ హీరోగా డేవిడ్ రెడ్డి పేరుతో ఓ పీరియాడికల్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో పాటు కోలీవుడ్ హీరో శింబు గెస్ట్ రోల్స్‌లో నటించనున్నట్లు సమాచారం.
రామ్ చరణ్, మంచు మనోజ్
Ram Charan మెర్విక్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ (RRR) మూవీలో ఫ్రీడమ్ ఫైటర్‌గా కనిపించారు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan). ఈ హిస్టారికల్ ఫిక్షన్ మూవీలో సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటనకు హాలీవుడ్ ఆడియెన్స్ సైతం ఫిదా అయ్యారు. ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్‌తో పాటు పలు ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకొని చరిత్రను సృష్టించింది. ఆర్ఆర్ఆర్ తర్వాత మరోసారి రామ్‌చరణ్ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఫుల్ లెంగ్త్ రోల్ కాకుండా గెస్ట్‌గా చేయనున్నాడు.
మంచు మనోజ్ (Manchu Manoj) హీరోగా డేవిడ్ రెడ్డి పేరుతో తెలుగులో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. 1897 - 1922 మధ్యకాలంలో బ్రిటీషర్లను ఎదురించి పోరాడిన ఓ యోధుడి కథతో ఈ సినిమా రూపొందుతోంది. కుల వివక్షకు వ్యతిరేకంగా నిలిచిన ఓ తిరుగుబాటుదారుడిగా ఛాలెంజింగ్ రోల్‌లో మంచు మనోజ్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు హనుమారెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ పీరియాడికల్ మూవీలో తెలుగు, తమిళ భాషలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్‌లో కనిపించబోతున్నారట. ఈ అతిథి పాత్రల్లో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో శింబు నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మంచు మనోజ్‌కు రామ్‌చరణ్, శింబు... ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఈ స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొనే మంచు మనోజ్... చరణ్‌తో పాటు శింబును గెస్ట్ రోల్స్ కోసం సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే శింబు.... డేవిడ్ రెడ్డిలో నటించడానికి ఓకే చెప్పాడట. రామ్‌చరణ్ నుంచి మాత్రం అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదని టాక్. డేట్స్ అడ్జెస్ట్ బట్టి రామ్‌చరణ్... డేవిడ్ రెడ్డికి ఓకే చెప్పనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో క్లారిటీ రావచ్చునని అంటున్నారు.
ఈ సినిమాలో రామ్‌చరణ్, శింబు ఫ్రీడమ్ ఫైటర్లుగా కనిపించబోతున్నట్లు సమాచారం. వీరిద్దరి పాత్రల నిడివి తక్కువే అయినా పవర్‌ఫుల్‌గా ఉంటాయని అంటున్నారు.
ప్రస్తుతం రామ్‌చరణ్ పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరోవైపు వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ సినిమా చేస్తున్నాడు శింబు.
సంబంధిత వార్తలు

Manchu Manoj | వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ ….మాకు రాజకీయాలు కొత్త కాదు – మంచు మనోజ్ కామెంట్స్
మే 19, 2026

Ram Charan | బుచ్చిబాబు ఇచ్చిన గిఫ్ట్ – చేతి గాయంపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మే 18, 2026

Peddi Trailer | గుడిలో కాదు గ్రౌండ్లో దేవుడు – క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా రామ్‌చరణ్ – పెద్ది ట్రైలర్ రిలీజ్
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



