Satvika Veeravalli | కార్పొరేట్ కొలువు నుంచి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్.. హాట్ టాపిక్‌గా మారిన టాలీవుడ్ బ్యూటీ!
Satvika Veeravalli | సినిమా రంగంలో ఒక్క అవకాశం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసే వారు ఎందరో. కానీ కొందరికి మాత్రం తొలి సినిమాతోనే అదృష్టం తలుపు తడుతుంది. ఇప్పుడు ఇదే తరహాలో వార్తల్లో నిలుస్తోంది యంగ్ బ్యూటీ సాత్విక వీరవల్లి. ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు వరుస భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Nov 25, 2026, 6.40 pm IST
Satvika Veeravalli | సినిమా రంగంలో ఒక్క అవకాశం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసే వారు ఎందరో. కానీ కొందరికి మాత్రం తొలి సినిమాతోనే అదృష్టం తలుపు తడుతుంది. ఇప్పుడు ఇదే తరహాలో వార్తల్లో నిలుస్తోంది యంగ్ బ్యూటీ సాత్విక వీరవల్లి. ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు వరుస భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నాగచైతన్య, ధ్రువ్ విక్రమ్ వంటి హీరోల సినిమాలతో పాటు రామ్‌చరణ్–సుకుమార్ కాంబినేషన్‌లోనూ ఆమె పేరు వినిపిస్తోంది. ఇదే నిజమైతే.. తొలి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకున్న సాత్విక కెరీర్ మరో స్థాయికి చేరినట్లే!
నాగచైతన్య సినిమాలో హీరోయిన్‌గా?
సాత్వికకు సంబంధించి ప్రస్తుతం వినిపిస్తున్న ఆసక్తికరమైన వార్త నాగచైతన్య సినిమా. ‘బెదురులంక’ ఫేమ్ క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా ‘ఎన్‌సీ 25’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో కథానాయికగా సాత్వికను ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆమె నటనను ‘ఆకాశంలో ఒక తార’ ఎడిటింగ్ దశలోనే చూసి మెచ్చుకున్నారని, తమ నిర్మాణ సంస్థలో రెండు సినిమాలకు ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుగు సినిమాతోనే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలోనూ సాత్విక తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న ‘జాకీ’ సినిమాలో ఆమెకు అవకాశం వచ్చినట్లు సమాచారం. ఇదే నిజమైతే కోలీవుడ్‌లోనూ ఆమెకు తొలి అడుగు పడినట్లే. ఒకవైపు తెలుగులో యువ హీరోల సరసన అవకాశాలు.. మరోవైపు తమిళంలోనూ ఎంట్రీ.. ఇలా కెరీర్ ఆరంభంలోనే రెండు పరిశ్రమల్లో గుర్తింపు తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తోంది.
రామ్‌చరణ్ సినిమాలోనూ ఛాన్స్?
సాత్విక పేరు వినిపిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ రామ్‌చరణ్–సుకుమార్ కాంబినేషన్‌లో రానున్న సినిమా. ‘ఆర్‌సీ 17’గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఆమె పేరు పరిశీలనలో ఉన్నట్లు టాక్. ఈ అవకాశం కోసం పలువురు కథానాయికలు పోటీపడుతున్నారని, స్క్రీన్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ పాత్రకు సాత్విక పేరు దాదాపు ఖరారైనట్లు కొన్ని కథనాలు వస్తున్నాయి. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. కొత్తగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ భామకు ఇది భారీ ఆఫర్‌గా నిలువనుంది.
అమెరికాలో ఇంజినీరింగ్.. ఒరాకిల్‌లో ఉద్యోగం..
సాత్విక ప్రయాణం కూడా ఆసక్తికరమే. అమెరికాలో పెరిగిన ఆమె అక్కడే రెండు ఇంజినీరింగ్ డిగ్రీలు పూర్తి చేసినట్లు సమాచారం. అనంతరం ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఒరాకిల్‌లో ఉద్యోగం సంపాదించింది. అయితే చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఆసక్తి ఆమెను సినిమాల వైపు నడిపించింది. మంచి కార్పొరేట్ కెరీర్‌ను వదులుకుని నటననే తన లక్ష్యంగా ఎంచుకుంది. అందుకోసం ఉద్యోగానికి రాజీనామా చేసి సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు తొలి సినిమాతోనే మంచి గుర్తింపు రావడంతో ఆమె తీసుకున్న నిర్ణయానికి ఫలితం దక్కుతోందనే చెప్పాలి.
తొలి సినిమాతోనే మెప్పించి..
‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో కల్పన పాత్రలో సాత్విక కనిపించింది. ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన అమ్మాయి వ్యోమగామి కావాలని కలలు కనే పాత్రలో ఆమె ఒదిగిపోయింది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ వంటి నటుడితో స్క్రీన్ షేర్ చేసుకుంటూనే తనదైన నటనతో ప్రత్యేకత చాటుకుంది. ముఖ్యంగా సంభాషణలు లేని సన్నివేశాల్లోనూ హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌తో భావాలను పలికించడం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. కొత్త నటి అయినప్పటికీ పాత్రకు సహజత్వాన్ని తీసుకొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అదృష్టం కలిసొస్తే.. స్టార్ హీరోయిన్‌గా..
ఒకప్పుడు అమెరికాలో కార్పొరేట్ ఉద్యోగం చేసిన అమ్మాయి.. ఇప్పుడు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో వరుస అవకాశాలతో వార్తల్లో నిలుస్తోంది. తొలి సినిమాతోనే తన నటనకు గుర్తింపు తెచ్చుకున్న సాత్వికకు ప్రస్తుతం వినిపిస్తున్న ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే కెరీర్‌కు మంచి బూస్ట్ లభించనుంది. నాగచైతన్య, ధ్రువ్ విక్రమ్, రామ్‌చరణ్ సినిమాల్లో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నా.. ఆఫీషియల్‌గా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం కేవలం ప్రచారమైనా ఈ అవకాశాలన్నీ నిజమై.. వాటిని విజయవంతంగా మలచుకుంటే దక్షిణాది చిత్ర పరిశ్రమలో మరో స్టార్ హీరోయిన్‌గా హీరోయిన్ ఎదిగే అవకాశం ఉన్నది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Minister Uttam Kumar Reddy | మైనార్టీలను ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
- ●Anil Ravipudi | ప్రేక్షకులను నవ్వించడం సవాలుతో కూడిన సృజనాత్మక ప్రక్రియ: అనిల్ రావిపూడి
- ●Minister Seethakka | ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా అభ్యర్థులు కష్టపడాలి
- ●Rinku Singh | డిసెంబర్ 4న పెళ్లి పీటలెక్కనున్న రింకూ సింగ్, ప్రియా సరోజ్.. ప్రధాని మోదీకి ఆహ్వానం
- ●Sreeleela | శ్రీలీలకు వరుస ఫ్లాపులు..! కెరీర్లో అసలేం జరుగుతోంది?
- ●Dasyam Vinay Bhaskar | బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే రౌడీయిజం, బెదిరింపులు

Minister Uttam Kumar Reddy | మైనార్టీలను ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

Anil Ravipudi | ప్రేక్షకులను నవ్వించడం సవాలుతో కూడిన సృజనాత్మక ప్రక్రియ: అనిల్ రావిపూడి

Minister Seethakka | ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా అభ్యర్థులు కష్టపడాలి

Rinku Singh | డిసెంబర్ 4న పెళ్లి పీటలెక్కనున్న రింకూ సింగ్, ప్రియా సరోజ్.. ప్రధాని మోదీకి ఆహ్వానం





