త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RC 17 | రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ సినిమాలో న‌టించే ఛాన్స్ కావాలా? – బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ డైరెక్ష‌న్‌లో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ రాబోతుంది. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ సినిమా అఫీషియ‌ల్‌గా మొద‌లైంది. కాగా ఈ సినిమాలో న‌టించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తోన్న ఔత్సాహిక యాక్ట‌ర్ల‌కు మేక‌ర్స్ ఓ గుడ్‌న్యూస్ వినిపించారు. కాస్టింగ్ కాల్ ప్ర‌క‌ట‌న‌ను రిలీజ్ చేశారు. ప‌ద‌హారు ఏళ్ల నుంచి అర‌వై ఏళ్ల వ‌య‌సుల న‌టీన‌టులు ఎవ‌రైనా సినిమాలో న‌టించే అవ‌కాశం సొంతం చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించారు.

N

Entertainment | Published On Nov 27, 2026, 3.47 pm IST

RC 17 | రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ సినిమాలో న‌టించే ఛాన్స్ కావాలా? – బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌
Advertisement

RC 17 | రంగ‌స్థ‌లం బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ డైరెక్ష‌న్‌లో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ రాబోతుంది. ఇటీవ‌లే ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతోన్నాయి. డిసెంబ‌ర్ నుంచి ఈ భారీ బ‌డ్జెట్ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న 17వ మూవీ ఇది. ఆర్‌సీ 17 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కిస్తోన్నారు.

మైథ‌లాజిక‌ల్ ట‌చ్‌తో...

ఆర్‌సీ 17ను మైథ‌లాజిక‌ల్ ట‌చ్‌తో సుకుమార్ తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రీ లుక్ పోస్ట‌ర్‌లో కృష్ణుడిని త‌ల‌పించేలా రామ్‌చ‌ర‌ణ్ లుక్ రిలీజ్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమాలో హీరోయిన్‌ను ఇంకా ఫైన‌ల్ చేయ‌లేదు. సాత్విక వీర‌వ‌ల్లి, సారా అర్జున్‌తో పాటు మ‌రికొంద‌రి పేర్లు ప్ర‌చారం జ‌రుగుతోన్నాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

కాస్టింగ్ కాల్‌...

రామ్‌చ‌ర‌ణ్, సుకుమార్ మూవీలో న‌టించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి మేక‌ర్స్ ఓ గుడ్‌న్యూస్ వినిపించారు. కాస్టింగ్ కాల్ పేరుతో ఓ ప్ర‌క‌ట‌న‌ను రిలీజ్ చేశారు. ప‌ద‌హారు నుంచి అర‌వై ఏళ్ల వ‌య‌సున్న యాక్ట‌ర్ల కోసం ఎదురుచూస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఔత్సాహిక న‌టీన‌టులు త‌మ పోర్ట్‌ఫోలియాల‌ను src17casting@gmail.com, లేదా 9110564651 నంబ‌ర్‌కు పంపించాల‌ని పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చెల్ల‌వ‌ని వెల్ల‌డించారు.

Advertisement
Advertisement