త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bharathiraja | గుర్తుప‌ట్ట‌లేని విధంగా మారిపోయిన దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు – అభిమానుల్లో ఆందోళ‌న‌

కోలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా ఆరోగ్య ప‌రిస్థితిని వివ‌రిస్తూ సీనియ‌ర్ హీరోయిన్ రాధిక పెట్టిన ఓ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రాధిక పోస్ట్ చేసిన వీడియోలో వీల్ ఛైర్‌లో క‌ద‌ల‌లేని స్థితిలో భార‌తీరాజా ఉన్నారు.

N

News | Published On Apr 19, 2026, 8.27 pm IST

Bharathiraja | గుర్తుప‌ట్ట‌లేని విధంగా మారిపోయిన దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు – అభిమానుల్లో ఆందోళ‌న‌
Advertisement

Bharathiraja | కోలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా శ్వాస కోస స‌మ‌స్య‌ల‌తో ఇటీవ‌లే హాస్పిట‌ల్‌లో చేరారు. అప్ప‌టి నుంచి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై అభిమానుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. తాజాగా భార‌తీరాజాను సీనియ‌ర్ హీరోయిన్ రాధికా శ‌ర‌త్‌కుమార్‌ క‌లిశారు. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడిని ప‌రామ‌ర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది రాధిక.

వీల్ ఛైర్‌లో...

ఈ వీడియోలో పూర్తిగా గుర్తుప‌ట్ట‌లేని విధంగా భార‌తీరాజా మారిపోయారు. వీల్ ఛైర్‌లో క‌ద‌ల‌లేని స్థితిలో ఉన్నారు. భార‌తీరాజాను ఇలా చూస్తాన‌ని అనుకోలేదు. సినిమా మీద ఉన్న ప్రేమ‌నే ఆయ‌న్ని ముందుకు న‌డిపిస్తోంది అంటూ ఈ పోస్ట్‌లో రాధిక పేర్కొన్న‌ది. తాను ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తాయ్ కిళైవి సినిమా చూశాన‌ని భార‌తీరాజా త‌న‌తో చెప్పార‌ని, ఆయ‌న ప్ర‌శంస‌లు అవార్డుల క‌న్నా గొప్ప‌వ‌ని రాధిక పేర్కొన్న‌ది.
క‌ష్టంగా ఉంది...
రాధిక పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. భార‌తీరాజాను ఇలాంటి స్థితిలో చూడ‌టం క‌ష్టంగా ఉందంటూ నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతోన్నారు. ఆయ‌న కోలుకొని మ‌ళ్లీ సినిమాలు చేయాల‌ని అంటున్నారు. కాగా రాధిక‌ను హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసింది భార‌తీరాజానే కావ‌డం గ‌మ‌నార్హం.

కొడుకు మ‌ర‌ణం...

కొడుకు మ‌ర‌ణంతో భార‌తీరాజా మాన‌సికంగా చాలా కుంగిపోయార‌ని అంటున్నారు. అప్ప‌టి నుంచే ఆయ‌న ఆరోగ్యం దెబ్బ‌తింటూ వ‌స్తోంద‌ని చెబుతోన్నారు. భార‌తీరాజా త‌న‌యుడు మ‌నోజ్ గ‌త ఏడాది మార్చిలో గుండెపోటుతో క‌న్నుమూశారు. మ‌నోజ్ న‌టుడిగా త‌మిళంలో యాభైకిపైగా సినిమాలు చేశారు.

తెలుగులోనూ సినిమాలు...

కోలీవుడ్‌లో దిగ్గ‌జ ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నారు భార‌తీరాజా. ప‌ద‌హార వ‌య‌నిథిలే, వేదం పుధితు, క‌రుత‌మ్మ‌, అంతిమాంత‌రైతో పాటు భార‌తీరాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప‌లు త‌మిళ సినిమాలు క‌ల్ట్ క్లాసిక్‌లుగా నిలిచాయి. తెలుగులోనూ సీతాకోక‌చిలుక‌, ఆరాధాన సినిమాలు చేశారు. ద‌ర్శ‌కుడిగానే కాకుండా న‌టుడిగా కూడా ప‌లు త‌మిళ సినిమాల్లో క‌నిపించారు భార‌తీరాజా.

Advertisement
Advertisement