Raashii Khanna | ఉస్తాద్ కోసం బ్రేక్ లేకుండా 24 గంటలు పనిచేశా – రాశీఖన్నా కామెంట్స్
పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనే తన కల ఉస్తాద్ భగత్‌సింగ్‌తో నెరవేరిందని రాశీఖన్నా అన్నది. పవన్ సెట్స్‌లో ఎప్పుడూ పుస్తకాలు చదువుతూనే ఉంటారని చెప్పింది.
Raashii Khanna |పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో కథ కూడా వినకుండా ఉస్తాద్‌భగత్‌సింగ్ సినిమాకు ఓకే చెప్పానని రాశీఖన్నా అన్నది. ప్రస్తుతం హిందీలో ఓ రెండు వెబ్ సిరీస్‌లతో పాటు అక్షయ్‌కుమార్‌తో ఓ సినిమా చేస్తున్నానని చెప్పింది. రాశీఖన్నాహీరోయిన్‌గా నటించిన ఉస్తాద్ భగత్‌సింగ్ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఉస్తాద్ భగత్‌సింగ్ గురించి రాశీఖన్నా చెప్పిన ముచ్చట్లివే...
కథ వినకుండా...
పవన్ కళ్యాణ్ సినిమా అనగానే కథ కూడా వినకుండా ఉస్తాద్ భగత్‌సింగ్‌కు ఓకే చెప్పేశాను. మొదటి సినిమా చేస్తున్నప్పడే పవన్ కళ్యాణ్ గారి స్టార్‌డమ్, ఇమేజ్ గురించి తెలిపింది. అప్పుడే ఆయనతో కలిసి కెరీర్‌లో ఒక్క సినిమా అయినా చేయాలి అనుకున్నాను. 'ఉస్తాద్ భగత్ సింగ్'తో నా కల నెరవేరింది.ఇందులో శ్లోక అనే అమ్మాయిగా కనిపిస్తా. చాలా మోడ్రన్‌గా క్యారెక్టర్ సాగుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్‌తో నా కాంబినేషన్‌లో ఓ మంచి మాస్ సాంగ్ కూడా ఉంటుంది. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి, ఆ సాంగ్ షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాను.
సింపుల్ సర్సన్...
పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ పర్సన్. సెట్స్‌లో ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. ఆయనలో ఒక తెలియని అమాయకత్వం ఉంది. తక్కువ మాట్లాడతారు.. కానీ ప్రతి మాటలో విలువ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు. ఆయన నుంచి మానవత్వం నేర్చుకున్నాను. ఉస్తాద్ వేడుకలో స్టేజ్ మీద నుంచి పవన్ అభిమానులను చూస్తుంటే, ఆయనను ఒక దేవుడిలా ఆరాధిస్తున్నట్లు అనిపించింది.
కాంబినేషన్‌లో సీన్స్ లేవు...
ఉస్తాద్ భగత్‌సింగ్‌లో నాతో పాటు శ్రీలీల మరో హీరోయిన్‌గా నటించింది. కానీ మా ఇద్దరి కాంబినేషన్‌లో సీన్లు ఉండవు. శ్రీలీలతో పాటు నా పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. నా క్యారెక్టర్‌లోని వేరియేషన్స్ అభిమానులను ఆకట్టుకుంటాయి. పవన్ కళ్యాణ్ షెడ్యూల్స్‌కు తగ్గట్టుగా నా డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ సినిమా చేశాం. కొన్నిసార్లు పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటల షిఫ్టులు కూడా పని చేయాల్సివచ్చింది.
మంచి ఫ్యామిలీ సినిమా...
గబ్బర్ సింగ్ లాగే ఉస్తాద్ కూడా కూడా చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. ఓ మంచి ఫ్యామిలీ సినిమా, కుటుంబమంతా కలిసి థియేటర్‌లో చూడొచ్చు. ఈ సినిమాలో వింటేజ్ పవన్ కళ్యాణ్‌ను చూస్తారు.
ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్‌తో ఓ సినిమా చేస్తోన్నా. ఫర్జీ 2 వెబ్‌సిరీస్ షూటింగ్ జరుగుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో తెరకెక్కుతోన్న ఓ వెబ్‌సిరీస్‌లో ఒక పంజాబీ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను, అందులో నా డైలాగ్స్ అన్నీ పంజాబీలోనే ఉంటాయి. తమిళ్ లో రౌడీ అండ్ కో అనే సినిమా షూటింగ్ దశలో ఉంది. తెలుగులో కూడా కొన్ని కథలు వింటున్నాను.
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



