Priyadarshi | కేసీఆర్‌గా ప్రియదర్శి – మేకోవర్ వీడియో రిలీజ్
నాని హీరోగా నటించిన ప్యారడైజ్ రిలీజై వారం దాటినా కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. రెండు వందల కోట్లకు చేరువలో ఉంది. ఈ సినిమాలో శంకరన్న అనే పాత్రలో ప్రియదర్శి కనిపించాడు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తలపిస్తూ సాగిన ఈ పాత్ర ప్యారడైజ్ సినిమాకు ఓ హైలైట్‌గా నిలిచింది. ఈ పాత్ర కోసం మేకోవర్ అయిన తీరును వివరిస్తూ ప్రియదర్శి ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.
Priyadarshi | నాని హీరోగా నటించిన ప్యారడైజ్ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే నైజాంలో బ్రేక్ ఈవెన్‌ను సాధించిన ఈ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టింది. రెండు వందల కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. నాని కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ఒకటిగా ప్యారడైజ్ నిలిచింది.
అణిచివేతకు గురైన జాతి...
ప్యారడైజ్ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. అణిచివేతకు గురైన తమ జాతికి గుర్తింపు తీసుకొచ్చేందుకు ఓ యువకుడు సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. కయదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు మోహన్‌బాబు విలన్‌గా నటించాడు. సంపూర్ణేష్‌బాబు, సోనాలి కులకర్ణి కీలక పాత్రలు పోషించారు.
శంకరన్న...
ప్యారడైజ్‌లో శంకరన్న అనే క్యారెక్టర్‌లో ప్రియదర్శి కనిపించాడు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ్యానరిజమ్స్, బాడీలాంగ్వేజ్‌ను అనుకరిస్తూ సాగిన ఈ క్యారెక్టర్‌కు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రియదర్శి పాత్రను చూస్తుంటే కేసీఆర్‌ను చూసినట్లే ఉందంటూ సినిమా లవర్స్ కామెంట్లు పెడుతోన్నారు. ప్యారడైజ్ సెకండాఫ్ ప్రియదర్శి రోల్ హైలైట్‌గా నిలిచింది.
శంకర్న మేకర్...
తాజాగా శంకరన్న పాత్ర కోసం తాను సిద్ధమైన తీరును చూపిస్తూ ప్రియదర్శి ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. కేసీఆర్ రూపురేఖలతో కనిపించేలా ప్రోస్తటిక్ మేకప్‌తో ఈ క్యారెక్టర్ కోసం మేకోవర్ అయ్యారు. చాలా మంది మేకప్ ఆర్టిస్టులు ఇందుకోసం వర్క్ చేసినట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. ది మేకింగ్ ఆఫ్ శంకరన్న పేరుతో ప్రియదర్శి షేర్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
The making of Shankar anna 🔥
@TheParadiseOfflThank you @FirstShowonline for the video. https://t.co/bBTMdnb1As
— Priyadarshi Pulikonda (@Preyadarshe) October 5, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Paradise Movie | మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో ప్యారడైజ్ చిత్రబృందం ప్రత్యేక పూజలు
సెప్టెంబర్ 29, 2026

Tollywood | కులం అనే ఇరుకు గదిలో.. ఊపిరాడక మగ్గుతున్న తెలుగు సినిమా
సెప్టెంబర్ 28, 2026

The Paradise | ‘ది ప్యారడైజ్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. రిలీజ్‌కు ముందే రూ.50 కోట్ల దిశగా!
సెప్టెంబర్ 23, 2026
తాజావార్తలు
- ●Young India Integrated Schools | తెలంగాణలో లండన్, బర్మింగ్‌హామ్ లాంటి ఆరు అంతర్జాతీయ యూనివర్సిటీల క్యాంపస్‌లు
- ●Secretariat | రూ.లక్షల్లో బిల్లులు పెండింగ్.. సచివాలయంలో మంచినీటి సరఫరా బంద్
- ●Thunga Balu | ఓయూకు ప్రకటించిన 1000 కోట్లు వెంటనే ఇవ్వాలి
- ●Robbery | మేడిపల్లిలో భారీ చోరీ.. బంగారం షాపులో రూ.2 కోట్ల విలువై బంగారు, డైమండ్ ఆభరణాలు అపహరణ
- ●OPPO F35 | రూ.38,999కే ఒప్పో ఎఫ్35.. 8,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫీచర్లు అదుర్స్..
- ●IndiGo | ఇండిగో ప్రయాణికులకు షాక్.. విమాన టికెట్లపై అదనపు భారం..

Young India Integrated Schools | తెలంగాణలో లండన్, బర్మింగ్‌హామ్ లాంటి ఆరు అంతర్జాతీయ యూనివర్సిటీల క్యాంపస్‌లు

Secretariat | రూ.లక్షల్లో బిల్లులు పెండింగ్.. సచివాలయంలో మంచినీటి సరఫరా బంద్

Thunga Balu | ఓయూకు ప్రకటించిన 1000 కోట్లు వెంటనే ఇవ్వాలి

Robbery | మేడిపల్లిలో భారీ చోరీ.. బంగారం షాపులో రూ.2 కోట్ల విలువై బంగారు, డైమండ్ ఆభరణాలు అపహరణ



