Paradise Movie | మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో ప్యారడైజ్ చిత్రబృందం ప్రత్యేక పూజలు
ప్యారడైజ్ మూవీ టీమ్ మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి నిలువెత్తు బంగారంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Sep 29, 2026, 2.46 pm IST
Paradise Movie | నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ది ప్యారడైజ్ మూవీ మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా భారీగా వసూళ్లను రాబడుతోంది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమాకు 155 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సక్సెస్ జోష్‌లో ఉన్న ప్యారడైజ్ టీమ్ మంగళవారం మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని సందర్శించారు. హీరో నాని , డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి, నటుడు సంపూర్ణేష్‌బాబు తో పాటు మిగిలిన టీమ్ మెంబర్స్, టెక్నీషియన్లు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పట్టువస్త్రాలు...
ప్యారడైజ్ టీమ్ అమ్మవార్లకు నిలువెత్తు బంగారంతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని సందర్శించడానికి కంటే ముందు ములుగులోని గట్టమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
నాని మేకోవర్...
గుర్తింపు కోసం ఓ జాతి సాగించిన పోరాటంలో తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ మూవీని తెరకెక్కించారు. జడల్ పాత్రలో నాని నటన, అతడి మేకోవర్, యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ రోల్‌లో నాని నటించిన మొదటి సినిమా ఇది. కయదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. మోహన్‌బాబు విలన్‌గా నటించిన ఈ సినిమాలో సంపూర్ణేష్‌బాబు, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rahul Gandhi | ఒత్తిడి తెస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తాయ్.. రండి వీధుల్లోకి వచ్చి మీ గళాన్ని వినిపించండి.. యువతకు రాహుల్ పిలుపు
- ●Chamala Kirankumar Reddy | రేపు సిరిసిల్లలో కేటీఆర్‌కు సినిమా చూపించబోతున్నం
- ●iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ పై అదిరిపోయే డీల్.. రూ.57 వేల వరకు ఆదా..
- ●Nifty 50 | ఆందోళనలో ఇన్వెస్టర్లు.. నిఫ్టీ50 ఆరు నెలల కనిష్టానికి..
- ●Mallikarjun Kharge | ప్రధాని మోదీ చేతిలో సీఈసీ కీలుబొమ్మగా మారారు.. సర్‌పై కాంగ్రెస్ వీధి పోరాటం : ఖర్గే
- ●Kavitha | ఏమున్నా నేన్ ఆధారాలతోనే మాట్లాడ్తా.. నాతో పెట్టుకోకు: కేటీఆర్‌కు కవిత వార్నింగ్

Rahul Gandhi | ఒత్తిడి తెస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తాయ్.. రండి వీధుల్లోకి వచ్చి మీ గళాన్ని వినిపించండి.. యువతకు రాహుల్ పిలుపు

Chamala Kirankumar Reddy | రేపు సిరిసిల్లలో కేటీఆర్‌కు సినిమా చూపించబోతున్నం

iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ పై అదిరిపోయే డీల్.. రూ.57 వేల వరకు ఆదా..

Nifty 50 | ఆందోళనలో ఇన్వెస్టర్లు.. నిఫ్టీ50 ఆరు నెలల కనిష్టానికి..






