త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kayadu Lohar | ‘డ్రాగన్‌’తో క్రేజ్‌.. ‘ది ప్యారడైజ్‌’తో నిరాశ.. తెలుగులో కయదుకు దక్కని బ్రేక్‌!

Kayadu Lohar | తమిళ చిత్రం ‘డ్రాగన్‌’తో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న కయదు లోహర్‌కు తెలుగులో మాత్రం ఆశించిన విజయాలు దక్కడం లేదు. నాని నటించిన ‘ది ప్యారడైజ్‌’తో టాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని భావించిన ఈ భామకు నిరాశే ఎదురైంది. సినిమా మంచి వసూళ్లు సాధించినప్పటికీ.. ఆమె పాత్రపై విమర్శలు రావడం చర్చనీయాంశంగా మారింది.

P

Entertainment | Published On Oct 14, 2026, 7.55 pm IST

Kayadu Lohar | ‘డ్రాగన్‌’తో క్రేజ్‌.. ‘ది ప్యారడైజ్‌’తో నిరాశ.. తెలుగులో కయదుకు దక్కని బ్రేక్‌!
Advertisement

Kayadu Lohar | తమిళ చిత్రం ‘డ్రాగన్‌’తో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న కయదు లోహర్‌కు తెలుగులో మాత్రం ఆశించిన విజయాలు దక్కడం లేదు. నాని నటించిన ‘ది ప్యారడైజ్‌’తో టాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని భావించిన ఈ భామకు నిరాశే ఎదురైంది. సినిమా మంచి వసూళ్లు సాధించినప్పటికీ.. ఆమె పాత్రపై విమర్శలు రావడం చర్చనీయాంశంగా మారింది. అసోంకు చెందిన కయదు లోహర్‌ మోడలింగ్‌, అందాల పోటీల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నది. 2021లో కన్నడ చిత్రం ‘ముగిల్‌పేటె’తో నటిగా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత మలయాళ చిత్రం ‘పథోన్పథం నూట్టాండు’లో నటించి అక్కడి ప్రేక్షకులనూ పలకరించింది. 2022లో శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘అల్లూరి’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ సినిమా ఆమెకు ఆశించిన బ్రేక్‌ను ఇవ్వలేకపోయింది.

‘డ్రాగన్‌’తో పెరిగిన క్రేజ్‌..

విభిన్న భాషల్లో సినిమాలు చేసినప్పటికీ కయదుకు అసలు గుర్తింపు తమిళ చిత్రం ‘డ్రాగన్‌’తో వచ్చింది. ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటించిన ఈ సినిమా విజయంతో ఆమెకు యువతలో మంచి క్రేజ్‌ ఏర్పడింది. దీంతో తెలుగులోనూ వరుస అవకాశాలు దక్కించుకున్నారు. విశ్వక్‌సేన్‌తో ‘ఫంకీ’లో నటించినా ఆశించిన ఫలితం రాలేదు. నాని సరసన ‘ది ప్యారడైజ్‌’లో అవకాశం రావడంతో ఈ సినిమాతో తన కెరీర్‌ మలుపు తిరుగుతుందని భావించారు. ఇటీవల ‘ది ప్యారడైజ్‌’ మూవీలో నటించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చివరకు అదే ఊపును కొనసాగించలేకపోయింది. కయదు పోషించిన పాత్రపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కథలో ఆమె పాత్రను తీర్చిదిద్దిన తీరుపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. దీంతో ఈ సినిమా ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపును తీసుకురాలేకపోయింది.

సక్సెస్‌ అందుకొని..

ఇదిలా ఉండగా.. ఓ వైపు కయదు వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. వరుసగా అవకాశాలు వస్తున్నా తెలుగులో మంచి సక్సెస్‌ అందుకొని తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆమె తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్‌ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నది. ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ కెరీర్‌ను విస్తరించుకుంటున్న కయదు.. తెలుగులోనూ మరో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. మరి, రాబోయే చిత్రాలతోనైనా టాలీవుడ్‌లో సక్సెస్‌ అందుకుంటుందేమో చూడాలి. ప్రస్తుతం మలయాళంలో థారమ్‌, తమిళంలో మంజనాత్తితో పాటు సూర్య48లోనూ నటిస్తోంది.

Advertisement
Advertisement