Thriller OTT | ప్రేమిస్తే భరత్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ – విలన్‌గా లేడీ యాంకర్ – స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ప్రేమిస్తే హీరో భరత్ తెలుగులో ఓ వెబ్‌సిరీస్ చేశాడు. పంచనామా పేరుతో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ వెబ్‌సిరీస్‌లో తెలుగు లేడీ యాంకర్ విలన్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం.
Thriller OTT | ప్రేమిస్తే సినిమాతో తెలుగులో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు భరత్. తమిళ డబ్బింగ్‌గా రిలీజైన ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్టుగా నిలిచింది. ప్రేమిస్తేతో వచ్చిన క్రేజ్‌తో అడపాదడపా తెలుగులో కొన్ని సినిమాలు చేశాడు భరత్.
క్రైమ్ థ్రిల్లర్...
లాంగ్ గ్యాప్ తర్వాత పంచనామా పేరుతో తెలుగులో ఓ వెబ్‌సిరీస్ చేశాడు భరత్ . క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ రివీలయ్యాయి. సెప్టెంబర్ 11న జీ5 ఓటీటీలో రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ జీ5 ఓటీటీ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో భరత్ కనిపిస్తున్నారు. మరో సగం పోస్టర్‌లో ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్న ఉండటం ఆసక్తిని పంచుతోంది.
తెలుగు యాంకర్...
పంచనామా వెబ్‌సిరీస్‌లో సీనియర్ యాంకర్ ఉదయభాను విలన్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం. మధు రెడ్డి, అపూర్వ ఓ కీలక పాత్రలను పోషిస్తున్నారు. త్రిబాణధారి బార్బరిక్ ఫేమ్ మోహన్ శ్రీవత్స పంచనామా వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.
నివేథా థామస్ శ్రీమతి
పంచనామాతో పాటు తమ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న అప్‌కమింగ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలను జీ5 ఓటీటీ రివీల్ చేసింది. నివేథా థామస్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న శ్రీమతి వెబ్‌సిరీస్ త్వరలో రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు సీజన్ 2 రాబోతున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు నాగచైతన్య వృషకర్మ, వెంకటేష్, అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల, ఎన్‌బీకే 111 సినిమాల డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mamitha Baiju | ఓటీటీలోకి సూర్య, మమితా బైజు సూపర్ హిట్ మూవీ – పెళ్లి కాకుండానే హీరోయిన్ తల్లిగా మారితే?
సెప్టెంబర్ 1, 2026

Allari Naresh | భక్తి కథతో అల్లరి నరేష్ మూవీ – హీరోయిన్గా కాజల్ – షూటింగ్ కంప్లీట్ కాకముందే ఓటీటీ డీల్ క్లోజ్
ఆగస్టు 30, 2026

Irumudi OTT | రవితేజ ఇరుముడి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే – స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆగస్టు 23, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి



