త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu OTT | ఓటీటీలోకి డీజే టిల్లు డైరెక్ట‌ర్ తెలుగు క్రైమ్ కామెడీ మూవీ – అతి అనుమానాలు అన‌ర్థాలు తెచ్చిపెడితే!

డీజే టిల్లు డైరెక్ట‌ర్ విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లేటెస్ట్ మూవీ అనుమాన ప‌క్షి థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచింది. రాగ్‌మ‌యూర్ హీరోగా న‌టించిన ఈ సినిమా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. న‌వంబ‌ర్ 20 నుంచి స‌న్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ క్రైమ్ కామెడీ మూవీలో మిథిలా పాల్క‌ర్ హీరోయిన్‌గా న‌టించింది.

N

Entertainment | Published On Nov 15, 2026, 8.33 pm IST

Telugu OTT | ఓటీటీలోకి డీజే టిల్లు డైరెక్ట‌ర్ తెలుగు క్రైమ్ కామెడీ మూవీ – అతి అనుమానాలు అన‌ర్థాలు తెచ్చిపెడితే!
Advertisement

Telugu OTT | డీజే టిల్లు ఫేమ్ విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అనుమాన ప‌క్షి ఇటీవ‌లే థియేట‌ర్ల‌లో రిలీజైంది. క్రైమ్ కామెడీగా తెర‌కెక్కిన ఈ సినిమాలో రాగ్‌మ‌యూర్ హీరోగా న‌టించాడు. డీజే టిల్లు సంచ‌ల‌న విజ‌యం త‌ర్వాత విమ‌ల్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన సినిమా కావ‌డంతో అనుమాన ప‌క్షిపై తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి ఏర్ప‌డింది. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కావ‌డం, తాను ఎంచుకున్న క‌థ‌ను అర్థ‌వంతంగా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ‌టంతో ఈ సినిమా డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

స‌న్ నెక్స్ట్ ఓటీటీలో

అనుమాన ప‌క్షి మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది. న‌వంబ‌ర్ 20 నుంచి స‌న్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. అనుమాన ప‌క్షి సినిమాలో మిథిలా పాల్క‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. ప్రిన్స్‌, అజ‌య్‌, రాశీ కీల‌క పాత్ర‌లు పోషించారు. అతి అనుమానాలు ఎలాంటి అన‌ర్థాల‌కు దారితీస్తాయ‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు విమ‌ల్ కృష్ణ ఈ సినిమాను తెర‌కెక్కించారు. పాయింట్ కామెడీగా ఉన్న చెప్పిన విధానం క‌న్ఫ్యూజింగ్‌గా ఉండ‌టంతో ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

యూట్యూబ‌ర్‌...

స‌న్నీ ఓ యూట్యూబ‌ర్‌. అనుమానాలు ఎక్కువ‌. త‌న యూట్యూబ్ ఛానెల్‌కు అనుమాన‌ప‌క్షి అనే పేరు పెడ‌తాడు. త‌న అనుమాన‌ల‌తో ప‌క్క‌వారి జీవితాల‌తో ఆడుకుంటాడు. స‌న్నీ కార‌ణంగా ఓ స్నేహితుడి బిజినెస్ లాస‌వుతుంది. జైలు పాల‌వుతాడు. స‌న్నీపై రివేంజ్ తీర్చుకోవ‌డానికి అత‌డిని క‌శ్మీర్ ర‌ప్పిస్తాడు.
అక్క‌డ స‌న్నీకి క‌న్య ప‌రిచ‌య‌మ‌వుతుంది. తొలిచూపులోనే ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. క‌న్య కూడా స‌న్నీని ఇష్ట‌ప‌డుతుంది. త‌న తండ్రికి అత‌డిని ప‌రిచ‌యం చేస్తుంది. పెళ్లికి ఒకే అనుకుంటున్న త‌రుణంలోనే స‌న్నీ రూమ్‌లో ఓ డెడ్‌బాడీ దొరుకుతుంది. హ‌నీమూన్ కోసం క‌శ్మీర్ వ‌చ్చిన సీఐ వాసు..ఈ హ‌త్య స‌న్నీనే చేసి ఉంటాడ‌ని అనుమానిస్తాడు. అత‌డి అనుమానం నిజ‌మైందా? స‌న్నీ రూమ్‌లో చ‌నిపోయిన వ‌ర్మ ఎవ‌రు? అత‌డి డెడ్‌బాడీ స‌న్నీ రూమ్‌లోకి ఎలా వ‌చ్చింది? ఈ మ‌ర్డ‌ర్ కేసు నుంచి స‌న్నీ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? ప్రేమ పేరుతో స‌న్నీని క‌న్య ఎలా మోసం చేసింది అన్న‌దే అనుమాన ప‌క్షి క‌థ‌.

 

Advertisement
Advertisement