Pooja Hegde | అప్పుడు హీరోయిన్ – ఇప్పుడు ఐటెంసాంగ్ – త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్డే
ఆరేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్‌తో సినిమా చేయబోతుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. అయితే హీరోయిన్‌గా కాదు. వెంకటేష్ ఆదర్శకుటుంబంలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Pooja Hegde | త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అల వైకుంఠపురములో, అరవింద సమేత వీర రాఘవ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది పూజా హెగ్డే. ఈ రెండు సినిమాలతో బుట్టబొమ్మగా అభిమానుల మనసుల్లో నిలిచిపోయింది. పూజా హెగ్డే కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా అల వైకుంఠపురములో, అరవింద సమేత నిలిచాయి. గ్లామర్ రోల్స్ మాత్రమే చేయలదనే విమర్శల నుంచి పూజా హెగ్డేను ఈ సినిమాలే బయటపడేలా చేశాయి.
ఆరేళ్ల తర్వాత....
ఆరేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో సినిమా చేయబోతుంది పూజా హెగ్డే. అయితే హీరోయిన్‌గా కాదు. స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వెంకటేష్‌తో ఆదర్శకుటుంబం హౌస్ నంబర్ 47, ఏకే 47 సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో వెంకటేష్‌కు జోడీగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
ప్రత్యేక గీతం...
ఆదర్శకుటుంబం సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ ఐటెంసాంగ్ కోసం మేకర్స్ ఇటీవలే పూజా హెగ్డేను సంప్రదించారట. త్రివిక్రమ్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఈ ప్రత్యేక గీతంలో నటించడానికి పూజా హెగ్డే అంగీకరించినట్లు చెబుతోన్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో వెంకటేష్, పూజా హెగ్డేలపై ఈ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించేందుకు త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ పాట కోసం ఓ లావిష్ సెట్ వేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
గతంలో వెంకటేష్ హీరోగా నటించిన ఎఫ్ 3లో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది. ఆదర్శ కుటుంబంతో రెండోసారి ఈ టాలీవుడ్ హీరోతో కలిసి స్టెప్పులు వేయబోతుంది.
రైటర్‌గా...
ఆదర్శ కుటుంబం సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో నారా రోహిత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. గతంలో వెంకటేష్ నటించిన వాసు, నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరీ సినిమాలకు త్రివిక్రమ్ రైటర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం తెలుగులో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ లవ్‌స్టోరీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతోనే నాలుగేళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



