Pooja Hegde | షూటింగ్‌లో అసభ్యంగా ప్రవర్తించిన హీరో – చెంపపగలగొట్టిన పూజా హెగ్డే
ఓ పాన్ ఇండియన్ షూటింగ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గురించి పూజా హెగ్డే వెల్లడించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ హీరోత అనుమతి లేకుండా తన కారావ్యాన్‌లోకి ఎంటర్‌కావడమే కాకుండా అనుచితంగా ప్రవర్తించబోయాడంటూ ఈ వీడియోలో పూజా హెగ్డే తెలిపింది.
Pooja Hegde | ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఓ హీరోయిన్ నటించిన రెండు, మూడు సినిమాలు ఫెయిలైతే మళ్లీ అవకాశాలు రావడం కష్టమే. కానీ పూజా హెగ్డే కెరీర్ మాత్రం అందుకు భిన్నంగా సాగుతోంది. పూజా హెగ్డే హిట్టు అందుకొని ఐదేళ్లు దాటిపోయింది. అయినా ఈ అమ్మడికి అవకాశాలకు కొదవ లేదు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది.
పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన జననాయగన్ రిలీజ్‌కు రెడీగా ఉంది. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ మూవీ సంక్రాంతికే విడుదల కావాల్సింది. కానీ సెన్సార్ సమస్యల వల్ల వాయిదాపడింది.హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
వీడియో వైరల్...
తాజాగా పూజా హెగ్డే పాత ఇంటర్వ్యూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ హీరో తన అనుమతి లేకుండా కారావ్యాన్‌లోకి ఎంటర్‌కావడంతో కాకుండా అనుచితంగా ప్రవర్తించాడంటూ ఈ వీడియోలో పూజా హెగ్డే పేర్కొన్నది.
చేదు అనుభవం...
"నా కెరీర్‌లోనూ చేదు అనుభవాలు చాలానే ఉన్నాయి. కొందరు షూటింగ్‌లలో పాటించాల్సిన నియమాలను అతిక్రమిస్తుంటారు. ఎదుటివారితో చెడుగా ప్రవర్తిస్తుంటారు. గతంలో ఓ పాన్ ఇండియన్ సినిమాలో నటించేటప్పుడు నా అనుమతి లేకుండా ఓ హీరో కారావ్యాన్‌లోకి వచ్చాడు. ఆ టైమ్‌లో అతడో పెద్ద హీరో అనే విషయం కూడా గుర్తుకు రాలేదు. అతడి తీరు నచ్చలేదు. అదే మాట చెబుతూ అసంతృప్తిని వ్యక్తం చేశా. అయినా వినకుండా నాతో అనుచితంగా ప్రవర్తించబోయాడు. దాంతో కోపంగా చెంపపై గట్టిగా కొట్టాను. మళ్లీ ఆ హీరోతో సినిమా చేయకూడదని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నా. భవిష్యత్తులో అవకాశం వచ్చినా కూడా ఇదే నిర్ణయానికి కట్టుబటి ఉంటాను" అని పూజా హెగ్డే అన్నది. ఆ హీరో ఎవరన్నది మాత్రం పూజా హెగ్డే వెల్లడించలేదు.
పాన్ ఇండియన్ హీరో...
పూజా హెగ్డే వీడియో క్లిప్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్టు కొడుతోంది. టాలీవుడ్ క్రేజ్‌ను పాన్ ఇండియన్ లెవెల్‌కు తీసుకెళ్లిన ఓ హీరో గురించే పూజా హెగ్డే ఈ కామెంట్స్ చేసిందని నెటిజన్లు చెబుతోన్నారు. ఆ హీరో నటించిన మూవీ ఒకటి ఇటీవలే సంక్రాంతికి రిలీజై డిజాస్టర్‌గా నిలిచిందని చెబుతోన్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం పూజా హెగ్డేతో ఆ హీరో నటించిన మూవీ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని, ఆ సినిమా షూటింగ్‌లోనే సదరు హీరో పూజా హెగ్డేతో తప్పుగా ప్రవర్తించాడని అంటున్నారు. ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



