Varun Tej | అన్న హీరో – చెల్లి నిర్మాత – పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా మొదలైన వరుణ్ తేజ్ బరి
టాలీవుడ్‌లో మరో కొత్త కాంబినేషన్ సెట్టయ్యింది. వరుణ్ తేజ్ హీరోగా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న బరి మూవీ శనివారం గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. ఈ ప్రారంభోత్సవ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
Varun Tej | మెగా హీరో వరుణ్ తేజ్ కొత్త సినిమా బరి శనివారం మొదలైంది. ఈ సినిమా లాంఛింగ్ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. బరి మూవీకి మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించబోతున్నది. కమిటీ కుర్రాళ్లు ఫేమ్ యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నాచెల్లెళ్లు వరుణ్ తేజ్, నిహారిక కాంబినేషన్‌లో వస్తోన్న ఫస్ట్ మూవీ ఇదే కావడం గమనార్హం.శనివారం జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో వరుణ్‌తేజ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు పవన్ కళ్యాణ్ క్లాప్ నిచ్చారు.
సంక్రాంతి బరిలో...
ఓపెనింగ్ రోజే బరి రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు నిహారిక వెల్లడించింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ వాలీబాల్ ప్లేయర్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం.
పోస్టర్ రిలీజ్...
బరి మూవీ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ అని బోర్డ్ రాసి ఉన్న ఓ ఇళ్లు కనిపిస్తోంది. దాని ముందు కొంత మంది యువకులు వాలీబాల్ ఆడటం, చుట్టూ జనాలు వారిని ఎంకరేజ్ చేస్తున్నట్లుగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది.
త్వరలో షూటింగ్...
బరి మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించబోతున్నారు. బరి మూవీకి అనుదీప్ దేవ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
కమిటీ కుర్రాళ్లు మూవీతోనే దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు యదు వంశీ. నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమా కమర్షియల్‌గా హిట్టవ్వడమే కాకుండా పలు అవార్డులను అందుకుంది. దర్శకుడిగా బరి అతడి సెకండ్ మూవీ.
కొరియన్ కనకరాజు...
మరోవైపు వరుణ్‌తేజ్ ప్రస్తుతం కొరియన్ కనకరాజు సినిమా చేస్తోన్నారు. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ తుది దశకు చేరుకుంది. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో కమెడియన్ సత్య కీలక పాత్ర పోషిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



