Nidhhi Agerwal | మలయాళంలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన నిధి అగర్వాల్ – మైథాలజీ సినిమాలో హీరోయిన్‌గా!
రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ మలయాళ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఓ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ చేయబోతుంది. గురువాయూర్ అరంగేట్టం అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మలయాళ అగ్ర హీరో ఉన్ని ముకుందన్ రిలీజ్ చేయబోతున్నారు.
Entertainment | Published On Nov 22, 2026, 4.40 pm IST
Nidhhi Agerwal | టాలీవుడ్ లో మలయాళ హీరోయిన్ల హవా నడుస్తోంది. అనుపమ పరమేశ్వరన్, అనస్వర రాజన్ తో పాటు పలువురు ముద్దుగుమ్మలు తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. తెలుగులో సినిమా చేసే అవకాశం కోసం మలయాళ నాయికలు ఎదురుచూస్తుంటే ....రాజసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ ట్రెండ్ ను తిరగరాయబోతుంది. టాలీవుడ్ నుంచి మలయాళం లోకి హీరోయిన్ గా అడుగుపెట్టబోతుంది.
రాజాసాబ్ డిజాస్టర్ తర్వాత...
రాజాసాబ్ డిజాస్టర్ తర్వాత ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లోనే కనిపించింది నిధి అగర్వాల్. దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా మలయాళం లో గురువాయూర్ అరంగేట్టం పేరుతో ఓ సినిమా రాబోతుంది. మైథాలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజీవ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గురువాయూర్ ఆలయం నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు సమాచారం. తెలుగులో ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసిన ఈ బ్యూటీ మలయాళ డెబ్యూ మూవీలో మాత్రం ఛాలెంజింగ్ రోల్ చేస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఐదు భాషల్లో...
సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాను మలయాళం స్టార్ హీరో ఉన్ని ముకుందన్ రిలీజ్ చేయబోతున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో గురువాయిర్ అరంగేట్టం విడుదల కానుంది.
టాలీవుడ్‌పై ఆశలు వదులుకుందా?
రాజాసాబ్ తర్వాత నిధి అగర్వాల్‌కు తెలుగులో అవకాశాలు రావడం లేదు. దాంతో టాలీవుడ్‌పై ఆశలు వదులుకున్న ఈ బ్యూటీ మలయాళం, తమిళంతో పాటు హిందీ ఇండస్ట్రీపై ఫోకస్ పెడుతోన్నట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mysaa Postponed | రష్మిక మందన్న "మైసా" వాయిదా....సెన్సార్ రూల్స్ కారణమా?
- ●Nitin Nabin | రేపు కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు
- ●Ardhanareshwar Sculpture Elephanta Caves | అర్ధనారీశ్వర ఫోటోతో బీజేపీ, ఆరెస్సెస్‌లకు రాహుల్ గాంధీ స్ట్రాంగ్ కౌంటర్
- ●Ponnam Prabhakar | రూ. 30 వేల కోట్ల సహాయం అందించాలని కేంద్రాన్ని కోరుతాం
- ●CCPA | యాంటీ డ్రోన్ గన్‌పై ప్రకటన.. కంపెనీకి రూ.10 లక్షల జరిమానా
- ●PAC Meeting | 2027లో ఓబీసీ కుల గణన చేయాలి.. దీనిపై ప్రధానికి లేఖ రాస్తాం

Mysaa Postponed | రష్మిక మందన్న "మైసా" వాయిదా....సెన్సార్ రూల్స్ కారణమా?

Nitin Nabin | రేపు కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు

Ardhanareshwar Sculpture Elephanta Caves | అర్ధనారీశ్వర ఫోటోతో బీజేపీ, ఆరెస్సెస్‌లకు రాహుల్ గాంధీ స్ట్రాంగ్ కౌంటర్

Ponnam Prabhakar | రూ. 30 వేల కోట్ల సహాయం అందించాలని కేంద్రాన్ని కోరుతాం





