HIV in Eswatini | ప్రతి నలుగురిలో ఒకరికి హెచ్ఐవీ.. ఏటా ఏడు వేల మందికి వ్యాప్తి
HIV in Eswatini | దక్షిణాఫ్రికాలోని అతి చిన్న దేశం ఎస్వతిని. మొత్తం జనాభా 12 లక్షలే. అందులో 3 లక్షల మంది హెచ్ఐవీ(HIV) సోకిన వారు ఉన్నారు. ఏటా దాదాపు 7 వేల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.
- జనాభా 12 లక్షలే.. అందులో 3 లక్షల మందికీ వైరస్
- పీడిస్తున్న మందుల కొరత
- ప్రపంచంలోనే మొదటి స్థానం
- ఎస్వతిని దేశంలో వ్యాప్తి కలకలం
HIV in Eswatini | త్రినేత్ర.న్యూస్: అది దక్షిణాఫ్రికాలోని అతి చిన్న దేశం. మొత్తం జనాభా 12 లక్షలే. అందులో 3 లక్షల మంది హెచ్ఐవీ(HIV) సోకిన వారు ఉన్నారంటే వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. ఏటా దాదాపు 7 వేల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. సురక్షిత లైంగిక పద్ధతులు పాటించకపోవడం, సంప్రదాయాల పేరిట విచ్చలవిడి శృంగారాన్ని(promiscuity) అనుమతించడం వంటివి వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
దక్షిణాఫ్రికాలోని అతిచిన్న దేశమే ఎస్వతిని. 2018లో ఈ దేశం తన పేరును స్వాజిలాండ్ నుండి ఎస్వతినిగా మార్చుకుంది. ఇక్కడ మొత్తం జనాభా దాదాపు 12 లక్షలుండగా వీరిలో ప్రతి నలుగురిలో ఒకరు హెచ్‌ఐవీ సోకిన వారు ఉన్నారు. ఏటా దాదాపు 7 వేల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. యువత (15-49 ఏళ్ల మధ్య) హెచ్‌ఐవీ బారిన పడుతున్న దేశాల్లో ఎస్వతిని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తుంది.
ఎలా వ్యాప్తి చెందిందంటే..
దేశ జనాభాలో దాదాపు 60 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. పేదరికం తీవ్రంగా ఉన్న ఈ దేశస్థులు పొరుగున ఉన్న దక్షిణాఫ్రికా గనుల్లో కూలీ పనులకు వెళ్తుంటారు. అక్కడ గనుల యజమానులు ఎస్వతిని మహిళలతో శృంగార వాంఛలు తీర్చుకోవడంతో వీరికి హెచ్ఐవీ అంటుకుంది. ఎస్వతిని సంప్రదాయ నృత్యం ‘రీడ్ డ్యాన్స్’ కు క్రేజీ ఉండడంతో ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తారు. నిరుపేద మహిళలు డబ్బు కోసం తమ శరీరాలను అర్పిస్తారు. తగిన జాగ్రత్తలు పాటించకపోవడం, విచ్చలవిడి శృంగారం వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
దేశ రాజు ఏటా ఓ యువతితో పెళ్లి..
ఇక పాఠశాలకు వెళ్లే పిల్లలు దాదాపు 18 శాతం మంది శృంగారంలో పాల్గొన్నామని చెబుతుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. బహుభార్యత్వం ఇక్కడ సర్వసాధారణం. సాక్షాత్తూ దేశ రాజే ‘రీడ్ డ్యాన్స్’ సందర్భంగా ఏటా ఓ యువతిని ఎంపిక చేసుకుని పెళ్లి చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీ. దేశంలో 1986లో తొలి హెచ్‌ఐవీ కేసు బయటపడింది.
మందుల కొరతతో ఇబ్బందులు..
లెనాకాపవిర్ (లెన్) కొరత దేశాన్ని పట్టిపీడిస్తోంది. హెచ్‌ఐవీ నిర్మూలన కోసం పనిచేస్తున్న గ్లోబల్ ఫండ్ ద్వారా ఏటా 6 వేల డోసుల లెనాకాపవిర్ రావాల్సి ఉండగా అందులో సగమే వస్తుండడం ఆందోళ కలిగిస్తోంది. గత 20 ఏళ్లుగా ప్రభుత్వం ఎయిడ్స్ నివవారణ చర్యలు చేపడుతోంది. ఎక్కువ మందికి చికిత్స అందిస్తుండడంతో చాలావరకు మరణాలను అడ్డుకోగలగడం శుభపరిణామం అని చెప్పవచ్చు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు
- ●Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!
- ●CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ
- ●MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ
- ●Oil Palm Hub | సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్‌పామ్ హబ్ ఏర్పాటుకు రిలయన్స్ ఆసక్తి
- ●Minister Jupally Krishna Rao | శ్రీలంక - తెలంగాణ మధ్య పర్యాటక బంధానికి మరింత ఊతం

Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు

Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!

CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ

MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ






