Venkatesh | చంటి సినిమాలో హీరోగా ఫస్ట్ అనుకున్నది ఎవరినంటే? – చిరంజీవి వల్లే వెంకటేష్‌కు ఛాన్స్?
విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోట్రెండ్‌సెట్టర్ మూవీస్‌లో చంటి ఒకటి. మాస్ హీరోగా ముద్రపడిన వెంకటేష్ ఈ సినిమాతోనే ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువయ్యాడు. అయితే ఈ బ్లాక్‌బస్టర్ మూవీలో హీరోగా ఫస్ట్ ఛాయిస్ వెంకటేష్ కాదు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించాల్సింది.
వెంకటేష్ కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమాల్లో చంటి ఒకటి. యాక్షన్, మాస్ సినిమాలు మాత్రమే చేయగలడనే ముద్రపడిన వెంకటేష్... చంటి సినిమాతోనే ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువయ్యారు. కేవలం నాలుగు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 16 కోట్ల కలెక్షన్స్‌తో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తల్లిపై అమితమైన ప్రేమ కలిగిన అమాయక యువకుడి పాత్రలో వెంకటేష్ అసమాన నటనతో ఆకట్టుకున్నాడు. చంటి మూవీ హిందీలో అనారి పేరుతో రీమేక్ అయ్యింది. అక్కడ కూడా పెద్ద విజయాన్ని సాధించింది. హిందీ రీమేక్‌లో కూడా వెంకటేష్ హీరోగా కనిపించారు. అనారితోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
రాజేంద్రప్రసాద్ హీరోగా...
తెలుగుతో పాటు బాలీవుడ్‌లో హిట్టు తెచ్చిపెట్టిన ఈ మూవీలో హీరోగా ఫస్ట్ ఛాయిస్ మాత్రం వెంకటేష్ కాదు. తమిళంలో విజయవంతమైన చినతంబి మూవీ ఆధారంగా చంటి మూవీని రూపొందించారు దర్శకుడు రవిరాజా పినిశెట్టి. చినతంబి రీమేక్ హక్కులను నిర్మాత కేఎస్ రామారావు కొనుగోలు చేశారు. ఈ సినిమాను రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెలుగులో తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేర్పులు చేసి రాజేంద్రప్రసాద్‌తో షూటింగ్ మొదలుపెట్టడానికి కేఎస్ రామారావు రెడీ అయ్యారు.
అదే టైమ్‌లో చినతంబి సినిమా చూసిన దిగ్గజ నిర్మాత రామానాయుడు...ఈ కథ వెంకటేష్‌కు అయితే బాగుంటుందని భావించి కొడుకును హీరోగా తీసుకోమని కేఎస్ రామారావును అడిగారట. రాజేంద్రప్రసాద్‌తో ఉన్న కమిట్‌మెంట్ కారణంగా నిర్మాత మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో చంటి రీమేక్ వ్యవహారం అప్పట్లో వివాదంగా మారిందట.
మెగాస్టార్ మధ్యవర్తి...
చివరకు మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకోవాల్సివచ్చిందట. కేఎస్ రామారావుతో ఉన్న చనువుతో మధ్యవర్తిగా వ్యవహరించిన చిరంజీవి...చివరకు చంటి మూవీ వెంకటేష్‌కు వచ్చేలా చేశారు. అలా రాజేంద్రప్రసాద్ చేయాల్సిన సినిమా కాస్త చిరంజీవి వల్ల వెంకటేష్‌కు దక్కింది. రాజేంద్రప్రసాద్‌కు మాత్రం హిట్టు మిస్సయ్యింది.
చంటి మూవీలో మీనా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా విజయంలో ఇళయరాజా మ్యూజిక్ కీలకంగా నిలిచింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



