Jupally Krishna Rao | తెలంగాణ పర్యాటకానికి జాతీయ గుర్తింపు గర్వకారణం: మంత్రి జూపల్లి
Jupally Krishna Rao | తెలంగాణ పర్యాటక (Telangana Tourism) రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు (Recognition) రావడం గర్వకారణమని పర్యాటక, సాంస్కృతిక మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నీతి ఆయోగ్ (NITI Aayog) తాజాగా విడుదల చేసిన 'దివ్య భారత్' (Divya Bharath) పర్యాటక నివేదికలో విశిష్ట గుర్తింపు దక్కడం శుభపరిణామమన్నారు.
Jupally Krishna Rao | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ పర్యాటక (Telangana Tourism) రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు (Recognition) రావడం గర్వకారణమని పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నీతి ఆయోగ్ (NITI Aayog) తాజాగా విడుదల చేసిన 'దివ్య భారత్' (Divya Bharath) పర్యాటక నివేదికలో రాష్ట్రానికి విశిష్ట గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్రంలోని వైవిధ్యభరితమైన పర్యాటక సామర్థ్యానికి ఈ నివేదిక అద్దం పడుతోందని చెప్పారు. ఇది తెలంగాణకు గర్వకారణమని ఆయన కొనియాడారు.
ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పనితీరుకు ఈ గుర్తింపే నిదర్శనమని ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్, చారిత్రక గోల్కొండ కోట, భువనగిరి కోట వంటి కట్టడాలతో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం వంటి ప్రసిద్ధ క్షేత్రాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని చెప్పారు. కేవలం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలే కాకుండా కుంటాల, బొగత జలపాతాలు, సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర వంటి సాంస్కృతిక వేడుకలు రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయని వివరించారు.
పర్యాటకులు తరలి రావాలి..
పోచంపల్లి ఇక్కత్ వంటి సంప్రదాయ కళలు పర్యాటక రంగాన్ని మరింత సుసంపన్నం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని సంప్రదాయాలు, రుచికరమైన వంటకాలు, ప్రకృతి రమణీయమైన దృశ్యాలను చూసేందుకు దేశ విదేశీ పర్యాటకులు రాష్ట్రానికి తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల కల్పనను మరింత బలోపేతం చేస్తామన్నారు. తెలంగాణ పర్యాటకాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని జూపల్లి పునరుద్ఘాటించారు.
సంబంధిత వార్తలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



