Municipal Election Results | యాదగిరిగుట్టలో బీజేపీ.. ములుగులో కాంగ్రెస్.. కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
Municipal Election Results | మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Municipal Election Results) కొనసాగుతున్నది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 123 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లను (Counting) లెక్కిస్తున్నారు.
Municipal Election Results | త్రినేత్ర.న్యూస్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Municipal Election Results) కొనసాగుతున్నది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 123 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లను (Counting) లెక్కిస్తున్నారు. పలు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా విజతలను కూడా ప్రకటిస్తున్నారు. యాదగిరిగుట్ట ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ కాంగ్రెస్ క్యాండిడేట్ అరుణపై గెలుపొందారు. 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గుండ్లపల్లి వాణి విజయం సాధించారు. భువనగిరి ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి స్వరూప రాణి గెలుపొందారు. ములుగు మున్సిపాలిటీలో ఒకటి, ఆరో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇబ్రహీంపట్నంలో 11, 12 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. 11వ వార్డులో కొండ్రు శ్రీలత, 12వ వార్డులో కొండ్రు త్రిలోక్ గెలుపొందారు.
మధ్యాహ్నం వరకు మున్సిపాలిటీలు, సాయంత్రం కార్పొరేషన్ల ఫలితాలు వెలువడనున్నాయి. ఈనెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. అదేరోజున కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఉంటుంది. కాగా, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికార విపక్షాలు తమ అభ్యర్థులను ఇప్పటికే క్యాంపులకు తరలించాయి.
కఠిన చర్యలు..
ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు, ప్రభుత్వ ఉద్యోగులపై దౌర్జన్యాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రజాప్రతినిధులైనా, అభ్యర్థులైనా, కార్యకర్తలైనా చట్టానికి ఎవరూ అతీతులు కారని స్పష్టం చేశారు. అధికారులపై ఫిర్యాదులు ఉంటే రాష్ట్ర ఎన్నికల సంఘం లేదా పై అధికారులకు ఫిర్యాదు చేయాలని వెల్లడించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో రాజకీయ నాయకులు, కార్యకర్తలు నిబంధనల మేరకు సహకరించాలని కోరారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



