Pooja Hegde | ఉన్న ఒక్క ఛాన్స్ పాయే – సునీల్ శెట్టి కొడుకు మూవీ నుంచి పూజా హెగ్డే ఔట్!
బాలీవుడ్ మూవీ సంకీ నుంచి పూజా హెగ్డేను మేకర్స్ పక్కనపెట్టారు. ఆమె ప్లేస్‌లో యంగ్ బ్యూటీ మేధా రానాకు ఛాన్స్ ఇచ్చారు. హీరోయిన్ మార్పు వ్యవహారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కావాలనే దర్శకనిర్మాతలు బుట్టబొమ్మను ఈ సినిమా నుంచి తప్పించినట్లు వార్తలొస్తున్నాయి.
Entertainment | Published On Nov 3, 2026, 3.48 pm IST
Pooja Hegde | ఓ బాలీవుడ్ రొమాంటిక్ యాక్షన్ మూవీలో నటించే అవకాశాన్ని పూజా హెగ్డే కోల్పోయింది. ఆమె ప్లేస్‌లో యంగ్ హీరోయిన్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకుందా? లేదంటే దర్శకనిర్మాతలు ఆమెను తప్పించారా? అన్నది హిందీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
సంకీ...
సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి హీరోగా బాలీవుడ్‌లో సంకీ పేరుతో రొమాంటిక్ లవ్ యాక్షన్ మూవీ అనౌన్స్‌చేశారు. ఈ సినిమాలో అహాన్ శెట్టికి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రకటించారు. ఓపెనింగ్ ఈవెంట్ కూడా గ్రాండ్‌గా జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సినిమా సెట్స్‌పైకి రావడం ఆలస్యమైంది. ఓపెనింగ్ ఈవెంట్ జరిగి రెండేళ్లయిన షూటింగ్ మొదలుకాకపోవడంతో సంకీ ఆగిపోయిందని ప్రచారం జరిగింది.
పెద్ద షాక్...
ఈ రూమర్లకు చెక్ పెడుతూ మేకర్స్ ఇటీవలే సంకీ చిత్రీకరణ ప్రారంభించారు. ప్రస్తుతం భోపాల్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. తాజాగా బుట్టబొమ్మకు సంకీ మేకర్స్ పెద్ద షాకిచ్చారు. పూజా హెగ్డే స్థానంలో మేధా రానా కథానాయికగా కనిపించబోతున్నట్లు వెల్లడించారు.
హాట్ టాపిక్...
పూజాహెగ్డేను కాదని యంగ్ హీరోయిన్‌కు ఛాన్స్ ఇవ్వడం బాలీవుడ్‌లో వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బుట్టబొమ్మకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆమెను పక్కనపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. పూజా హెగ్డే తప్పుకోలేదని...ఆమెను తప్పించారని అంటున్నారు. రెండేళ్ల క్రితం చెప్పిన కథతో పోలిస్తే కొత్త వెర్షన్‌లో చాలా మార్పులు, చేర్పులు చేశారని, వాటిలో భాగంగానే పూజా హెగ్డే ప్లేస్‌లో మేధా రానాను తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ హీరోయిన్ మార్పు వ్యవహారంతో మరోసారి సంకీ వార్తల్లో నిలిచింది.
శ్రీశ్రీతో కమ్‌బ్యాక్...
బాలీవుడ్‌లో ప్రస్తుతం పూజా హెగ్డేకు అంతగా అవకాశాలు రావడం లేదు. ఉన్న ఒక్క ఛాన్స్ చేజారిపోయింది. ప్రస్తుతం తెలుగులో శ్రీశ్రీ సినిమా చేస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీతో నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి కమ్‌బ్యాక్ ఇవ్వబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Radhika Apte | మొన్న జాన్వీ కపూర్… నేడు రాధిక ఆప్టే – టాలీవుడ్‌పై బాలీవుడ్ హీరోయిన్ విమర్శలు
నవంబర్ 3, 2026

Mrunal Thakur | 15 కోట్ల బడ్జెట్ – కోటి కలెక్షన్స్ – ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ డిజాస్టర్ మూవీ
నవంబర్ 2, 2026

Actor Imran Khan | భవిష్యత్తులో ఎలాంటి నిరసనల్లో పాల్గొనను.. బాంబే హైకోర్టుకు హీరో ఇమ్రాన్ క్షమాపణలు..!
నవంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Dasoju Sravan | రేవంత్ ధర్నా, అమిత్ షా పాదయాత్రతో తెలంగాణకు ఏం ఒరిగింది?
- ●NSE IX | ఇక రోజుకు 23.5 గంటల పాటు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్.. ఎన్ఎస్ఈ కీలక ప్రకటన..
- ●Graduate MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటు దరఖాస్తు గడువు పెంపు
- ●CS Sanjay Jaju | శాసన మండలి ప్రాంగణం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
- ●PM Modi | దేశంలోనే మొట్టమొదటి.. మహిళా ఆపరేటర్లతో నడిచే మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- ●Radhika Apte | మొన్న జాన్వీ కపూర్... నేడు రాధిక ఆప్టే - టాలీవుడ్‌పై బాలీవుడ్ హీరోయిన్ విమర్శలు

Dasoju Sravan | రేవంత్ ధర్నా, అమిత్ షా పాదయాత్రతో తెలంగాణకు ఏం ఒరిగింది?

NSE IX | ఇక రోజుకు 23.5 గంటల పాటు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్.. ఎన్ఎస్ఈ కీలక ప్రకటన..

Graduate MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటు దరఖాస్తు గడువు పెంపు

CS Sanjay Jaju | శాసన మండలి ప్రాంగణం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్



