త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manchu Lakshmi | మంచు ల‌క్ష్మి సినిమాలో మంచు విష్ణు “లెట్ దెమ్ నో” డైలాగ్

మంచు ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన లేచింది మ‌హిళా లోకం మూవీ ట్రైల‌ర్ సోమ‌వారం రిలీజైంది. ఇందులో మా ఎలెక్ష‌న్స్ టైమ్‌లో మంచు విష్ణు చెప్పిన లెట్ దెమ్ నో అనే డైలాగ్ వాడటం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ డైలాగ్‌పై మంచు ల‌క్ష్మి క్లారిటీ ఇచ్చింది.

N

News | Published On Mar 9, 2026, 8.43 pm IST

Manchu Lakshmi | మంచు ల‌క్ష్మి సినిమాలో మంచు విష్ణు “లెట్ దెమ్ నో” డైలాగ్
Advertisement

Manchu Lakshmi | మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల టైమ్‌లో మంచు విష్ణు చెప్పిన లెట్ దెమ్ నో అంకుల్‌ అనే డైలాగ్ బాగా పాపుల‌ర్ అయ్యింది. మంచు విష్ణు డైలాగ్‌ను మంచు ల‌క్ష్మి సినిమాలో వాడ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. మంచు ల‌క్ష్మి, అనన్య నాగళ్ల, హరితేజ, హేమ, సుప్రీత, శ్రద్ధాదాస్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో లేచింది మ‌హిళా లోకం పేరుతో ఓ క్రైమ్ కామెడీ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకు అర్జున్, కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మార్చి 26న రిలీజ్ అవుతోంది.

డ‌బ్బులిచ్చి రాయించ‌లేదు...

ఈ సినిమా ట్రైల‌ర్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు. ట్రైల‌ర్‌లో మంచు విష్ణు లెట్ దెమ్ నో అనే డైలాగ్ వినిపించింది. ఈ డైలాగ్ వాడ‌టంపై మంచు ల‌క్ష్మి రియాక్ట్ అయ్యింది. సినిమాలో డైలాగ్‌ ఉన్న విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని అన్న‌ది. "ఈ డైలాగ్ వాడాల‌నే ఆలోచ‌న ద‌ర్శ‌కుల‌దే. డ‌బ్బులిచ్చి రాయించింది కాదు. ఆ డైలాగ్‌కు నాకు ఏ సంబంధం లేద‌ని" మంచు ల‌క్ష్మి అన్న‌ది. అంతే కాకుండా ‘మేము చేసింది చిన్న సినిమానే కానీ అద్భుతంగా ఉంటుంది. కామెడీ విషయంలో ఫ‌స్ట్ టైమ్‌ రెచ్చిపోయి న‌టించా. సీరియస్ సబ్జెక్టును కామెడీతో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. ప్ర‌మోష‌న్స్‌లో చూపించిన బ్లూ డ్రమ్‌కు మా సినిమాకు సంబంధం ఉండదు. లేచింది మహిళాలోకం మర్డర్ చేయమని చెప్పే సినిమా కాదు.. అందరినీ నవ్వించే సినిమా అని మంచు ల‌క్ష్మి అన్న‌ది.

ఫ‌స్ట్ టైమ్ కామెడీ...

ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో మంచు ల‌క్ష్మితో పాటు అన‌న్య నాగ‌ళ్ల‌, హ‌రితేజ‌, హేమ కూడా పాల్గొన్నారు. తాను ఇప్పటి వరకు ఎక్కువ‌గా సీరియస్ రోల్స్ చేశాన‌ని, ఫస్ట్ టైమ్ ఫుల్ కామెడీతో తాను చేసిన సినిమా ఇద‌ని అన‌న్య నాగ‌ళ్ల తెలిపింది.చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో మంచి పాత్ర చేశాన‌ని హేమ అన్న‌ది. లేచింది మ‌హిళా లోకం మూవీకి శృతి రంజ‌ని మ్యూజిక్ అందిస్తోంది.

Advertisement
Advertisement