Telugu OTT | ఈ వీకెండ్ ఓటీటీలో మిస్సవ్వకుండా చూడాల్సిన తెలుగు సినిమాలు ఇవే
ఈ వారం బ్యాండ్‌మేళం, లేచింది మహిళా లోకంతో పాటు మరికొన్ని తెలుగు సినిమాలు ఓటీటీలో రిలీజయ్యాయి. మలయాళం, తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాల తెలుగు వెర్షన్స్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చాయి. ఈ వీకెండ్ ఓటీటీలో తెలుగులో చూడాల్సిన ఆ సినిమాలు ఏవంటే?
Entertainment | Published On Apr 24, 2026, 6.11 pm IST
Telugu OTT | ఈ శుక్రవారం ఒక్క రోజే ఓటీటీలో ఇరవైకిపైగా సినిమాలు రిలీజయ్యాయి. సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ, రొమాన్స్‌తో పాటు డిఫరెంట్ జానర్స్‌తో కూడిన సినిమాలు ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు సిద్ధమయ్యాయి. అందులో కొన్ని తెలుగు మూవీస్ కూడా ఉన్నాయి. ఈ వీకెండ్ మిస్సవ్వకుండా చూడాల్సిన ఆ తెలుగుసినిమాలు ఏవంటే?
బ్యాండ్‌మేళం...
కోర్టు మూవీ ఫేమ్ హర్ష్‌రోషన్, శ్రీదేవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ బ్యాండ్‌మేళం జీ5 ఓటీటీలో రిలీజైంది. సీనియర్ రైటర్ కోన వెంకట్ నిర్మించిన ఈ సినిమాకు సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించాడు. బావామరదళ్ల ప్రేమకథతో తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన బ్యాండ్‌మేళం థియేటర్లలో యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
లేచింది మహిళా లోకం...
మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, సుప్రిత ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ కామెడీ మూవీ లేచింది మహిళా లోకం సన్ నెక్స్ట్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అర్జున్, కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది. తన భర్తను చంపడానికి మరో ఐదుగురు మహిళలలో కలిసి ఓ గృహిణి ఎలాంటి ప్లాన్ వేసిందనే పాయింట్‌తో ఈ మూవీ రూపొందింది.
హ్యాపీ రాజ్...
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన హ్యాపీరాజ్ మూవీని తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఈ రొమాంటిక్ మూవీలో శ్రీగౌరిప్రియ హీరోయిన్‌గా నటించింది. మారియా రాజా దర్శకత్వం వహించాడు. తన లవ్ బ్రేకప్‌కు తండ్రి కారణమని అతడిని ద్వేషించే ఓ కొడుకు కథతో దర్శకుడు ఈ సినిమాను రూపొందించారు. ఇందులో ప్రేమదేశం హీరో అబ్బాస్ హీరోయిన్ తండ్రిగా కీలక పాత్రలో కనిపించాడు.
ప్రతిఛాయ
మలయాళం పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ప్రతిఛాయ తెలుగులో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నివీన్ పాల్ హీరోగా నటించాడు. ఈ సినిమాకు బీ ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించాడు.
ఇవే కాకుండా గ్రీన్‌లాండ్ 2 (లయన్స్ గేట్ ప్లే), నీ ఫరెవర్ (సన్ నెక్స్ట్), అపెక్స్‌తో (నెట్‌ఫ్లిక్స్) పాటు మరికొన్ని సినిమాలు ఈ వీక్‌లోనే తెలుగులోనూ విడుదలయ్యాయి.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



