త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Youtube | యూట్యూబ్‌లో రిలీజైన మంచు విష్ణు క‌న్న‌ప్ప – ఫ్రీగా స్ట్రీమింగ్‌

మంచు విష్ణు క‌న్న‌ప్ప మూవీ యూట్యూబ్‌లో రిలీజైంది. ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మైథ‌లాజిక‌ల్ మూవీలో ప్ర‌భాస్, మోహ‌న్‌లాల్‌, అక్ష‌య్ కుమార్, కాజ‌ల్ గెస్ట్ రోల్స్ చేశారు.

N

Entertainment | Published On Jul 4, 2026, 8.18 pm IST

Youtube | యూట్యూబ్‌లో రిలీజైన మంచు విష్ణు క‌న్న‌ప్ప – ఫ్రీగా స్ట్రీమింగ్‌
Advertisement

Youtube | మంచు విష్ణు హీరోగా న‌టించిన క‌న్న‌ప్ప గ‌త ఏడాది థియేట‌ర్ల‌లో రిలీజైంది. మైథ‌లాజిక‌ల్ క‌థ‌తో తెర‌కెక్కిన ఈ సినిమాలో ప్ర‌భాస్‌, మోహ‌న్‌లాల్‌, అక్ష‌య్ కుమార్‌, కాజ‌ల్ గెస్ట్ రోల్స్‌లో న‌టించారు. మోహ‌న్‌బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ ఈ సినిమాను నిర్మించారు.

యూట్యూబ్‌లో రిలీజ్‌...

భారీ అంచ‌నాల న‌డుమ థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. తాజాగా క‌న్న‌ప్ప మూవీ యూట్యూబ్‌లో రిలీజైంది. ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లోనూ యూట్యూబ్‌లో ఈ సినిమాను చూడొచ్చ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

ప్రీతి ముకుంద‌న్ హీరోయిన్‌...

క‌న్న‌ప్ప సినిమాలో ప్రీతి ముకుంద‌న్ హీరోయిన్‌గా న‌టించింది. మ‌హాభార‌తం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్ర‌భాస్‌, మోహ‌న్‌లాల్‌, అక్ష‌య్‌కుమార్ గెస్ట్‌లుగా న‌టించ‌డంతో రిలీజ్‌కు ముందు క‌న్న‌ప్ప‌పై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ తెలిసిన క‌థ కావ‌డం, ఎమోష‌న్స్ స‌రిగ్గా వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. దాదాపు 200 కోట్లతో రూపొందిన ఈ సినిమా థియేట‌ర్ల‌లో యాభై కోట్ల లోపే క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకుంది.

నాస్తికుడు....

తిన్న‌డు చిన్న‌ప్ప‌టి నుంచే నాస్తికుడిగా పెరుగుతాడు. అమ్మ‌వారి బ‌లి విష‌యంలో తండ్రిని ఎదురించి త‌న గూడెం నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌వుతాడు. నాస్తికుడైన తిన్న‌డు గొప్ప శివ‌భ‌క్తుడిగా ఎలా మారాడు? తిన్న‌డి జీవితాన్ని మ‌లుపుతిప్పిన మ‌హాదేవ‌శాస్త్రి, రుద్ర ఎవ‌రు? ప్రేమించిన తిన్న‌డి కోసం నెమ‌లి ఎలాంటి త్యాగానికి సిద్ధ‌ప‌డింది అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

గ్యాప్‌..

క‌న్న‌ప్ప త‌ర్వాత సినిమాల‌కు గ్యాప్ ఇచ్చాడు మంచు విష్ణు. నెక్స్ట్ సినిమా ఏద‌న్న‌ది ప్ర‌క‌టించ‌లేదు. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో మంచు విష్ణు హీరోగా ఓ సినిమా రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

Advertisement
Advertisement