త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vishnu Manchu | బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్ – కొత్త సినిమాను అనౌన్స్‌చేసిన మంచు విష్ణు – డైరెక్ట‌ర్‌గా పాపుల‌ర్ కొరియోగ్రాఫ‌ర్‌

నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రాఫ‌ర్ ప్ర‌భుదేవాతో మంచువిష్ణు ఓ సినిమా చేయ‌బోతున్నాడు. విష్ణు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌భుదేవా ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించాడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందుతోన్న ఈ మూవీతో దాదాపు ఐదేళ్ల త‌ర్వాత తిరిగి మెగాఫోన్ ప‌ట్ట‌బోతున్నారు ప్ర‌భుదేవా.

N

Entertainment | Published On Nov 23, 2026, 1.39 pm IST

Vishnu Manchu | బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్ – కొత్త సినిమాను అనౌన్స్‌చేసిన మంచు విష్ణు – డైరెక్ట‌ర్‌గా పాపుల‌ర్ కొరియోగ్రాఫ‌ర్‌
Advertisement

Vishnu Manchu |  క‌న్న‌ప్ప సినిమాతో గ‌త ఏడాది ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు మంచు విష్ణు. భారీ అంచ‌నాల న‌డుమ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ మైథాల‌జీ మూవీ ఫెయిల్యూర్‌గా నిలిచింది. క‌న్న‌న్న ప‌రాజ‌యంతో ఏడాదిన్న‌ర పాటు సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన మంచు విష్ణు త‌న త‌దుప‌రి సినిమాను అనౌన్స్‌చేశాడు. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రాఫ‌ర్ ప్ర‌భుదేవాతో ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

24వ సినిమా...

మంచు విష్ణు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ సినిమాను ప్ర‌భుదేవా సోష‌ల్ మీడియా ద్వారా అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించాడు. విష్ణుతో క‌లిసి దిగిన ఓ ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ప్ర‌భుదేవా హ్యాపీ బ‌ర్త్‌డే మై హీరో అంటూ క్యాప్ష‌న్ జోడించాడు. విష్ణు హీరోగా న‌టిస్తోన్న 24వ సినిమా ఇది. తెలుగుతో పాటు త‌మిళంలో ఏక‌కాలంలో ఈ మూవీ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోన్న‌ట్లు తెలిసింది. హీరోగా న‌టిస్తూనే ఈ సినిమాను స్వ‌యంగా మంచు విష్ణు నిర్మించ‌బోతున్నారు.

ఐదేళ్ల త‌ర్వాత‌...

మంచు విష్ణు సినిమాతో దాదాపు ఐదేళ్ల గ్యాప్ త‌ర్వాత మెగాఫోన్ ప‌ట్ట‌బోతున్నారు ప్ర‌భుదేవా. చివ‌ర‌గా స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టించిన బాలీవుడ్ మూవీ రాధేకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు ప్ర‌భుదేవా. తెలుగులో ద‌ర్శ‌కుడిగా నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, పౌర్ణ‌మి, శంక‌ర్ దాదా జిందాబాద్ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

 

Advertisement
Advertisement