త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam OTT | 25 కోట్ల బ‌డ్జెట్ – 325 కోట్ల క‌లెక్ష‌న్స్ – ఓటీటీలోకి మ‌మితాబైజు మ‌ల‌యాళ రొమాంటిక్ కామెడీ మూవీ

మ‌మితా బైజు హీరోయిన్‌గా న‌టించిన‌ బెత్లెహెం కుడుంబ యూనిట్ మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. అక్టోబ‌ర్ 2 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మ‌ల‌యాళ సినిమాలో నివీన్ పౌళీ హీరోగా న‌టించాడు.

N

News | Published On Sep 27, 2026, 8.33 pm IST

Malayalam OTT |  25 కోట్ల బ‌డ్జెట్ – 325 కోట్ల క‌లెక్ష‌న్స్  – ఓటీటీలోకి మ‌మితాబైజు మ‌ల‌యాళ రొమాంటిక్ కామెడీ మూవీ
Advertisement

Malayalam OTT | మ‌మితా బైజు హీరోయిన్‌గా న‌టించిన బెత్లెహెం కుడుంబ యూనిట్ మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక‌ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. కేవ‌లం 25 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 325 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు ప్రేమ‌లు ఫేమ్ గిరీష్ ఏడీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నివీన్ పౌలీ హీరోగా న‌టించిన ఈ సినిమాను మ‌ల‌యాళ అగ్ర హీరో ఫ‌హాద్ ఫాజిల్ నిర్మించారు.

తెలుగులో స్ట్రీమింగ్‌...

బెత్లెహెం కుడుంబ యూనిట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖ‌రారైంది. అక్టోబ‌ర్ 2 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఓటీటీలో మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల అవుతోంది.

క్యూట్ కెమిస్ట్రీ...

మ‌ల‌యాళంలో ఎలాంటి అంచ‌నాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన బెత్లెహెం కుడుంబ యూనిట్ మౌత్ టాక్‌తో పెద్ద విజ‌యాన్ని అందుకుంది. నివీన్ పౌలీ, మ‌మితా బైజు క్యూట్ కెమిస్ట్రీ, కామెడీ, ల‌వ్‌స్టోరీ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. తెలుగులో అదే పేరుతో ఈ మూవీ రిలీజైంది. ఇక్క‌డ కూడా మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఏజ్ గ్యాప్ కార‌ణంగా ఓ జంట ప్రేమ‌క‌థ‌కు ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయ‌నే కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించారు.

13 ఏళ్ల గ్యాప్‌...

జ‌స్టిన్ ప్రేమ‌లో ఫెయిల‌వుతాడు. ఆ సంఘ‌ట‌న కార‌ణంగా అమ్మాయిల‌కు దూరంగా ఉంటుంటాడు. న‌ల‌భై ఏళ్లు వ‌చ్చినా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతాడు. అనుకోకుండా జ‌స్టిన్ లైఫ్‌లోకి ఆష్లే వ‌స్తుంది. స్నేహంతో మొద‌లైన ఇద్ద‌రి బంధం ప్రేమ‌గా మారుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య ప‌ద‌మూడేళ్ల ఏజ్ గ్యాప్ ఉండ‌టంతో వారి ప్రేమ‌కు కుటుంబ‌స‌భ్యుల నుంచి అడ్డంకులు ఎదుర‌వుతాయి. ఈ స‌మ‌స్య‌ల నుంచి జ‌స్టిన్ ఆష్లే ఏ విధంగా బ‌య‌ట‌ప‌డ్డారు? త‌మ ప్రేమ‌ను ఏ విధంగా గెలిపించుకున్నారు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement
Advertisement