త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Mamatha Banerjee | మ‌మ‌త విమానం గాల్లో చ‌క్క‌ర్లు.. గంట పాటు అయోమ‌యం

CM Mamatha Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌త బెన‌ర్జీ (CM Mamatha Banerjee) ప్ర‌యాణిస్తున్న విమానాని (Aircraft)కి పెను ప్ర‌మాదం త‌ప్పింది. తుపాను కారణంగా గంటసేపు ఆకాశంలో చక్కర్లు కొట్టి ఎట్టకేలకు కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్షేమంగా దిగింది.

S

News | Published On Mar 27, 2026, 2.12 pm IST

CM Mamatha Banerjee | మ‌మ‌త విమానం గాల్లో చ‌క్క‌ర్లు.. గంట పాటు అయోమ‌యం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఇటీవ‌ల కాలంలో త‌ర‌చూ విమాన ప్ర‌మాదాలు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. ఎప్పుడూ ఎదో ఓ చోట సాంకేతిక స‌మ‌స్య‌లు తలెత్తుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌త బెన‌ర్జీ (CM Mamatha Banerjee) ప్ర‌యాణిస్తున్న విమానాని(Aircraft)కి పెను ప్ర‌మాదం త‌ప్పింది. తుపాను కారణంగా గంటసేపు గాలిలో చక్కర్లు కొట్టి (circling in the air) ఎట్టకేలకు కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్షేమంగా దిగింది.

పశ్చిమ బర్దమాన్‌ జిల్లాలో మ‌మ‌త‌ గురువారం 3.30 గంటల స‌మ‌యంలో ఎన్నికల ప్రచారం (election campaign)లో పాల్గొన్నారు. అనంత‌రం కోల్‌కతాకు బయలుదేరారు. 4 గంటల స‌మ‌యంలో విమానం దిగాల్సి ఉండ‌గా వాతావరణం అనుకూలించ‌లేదు. ఆకస్మికంగా భారీ వర్షం రావ‌డంతో పాటు బలమైన గాలులు వీచాయి. దీంతో కోల్‌క‌తా విమానాశ్ర‌యంలో విమానాలు దిగడానికి ప్ర‌తికూల ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. దీంతో మ‌మ‌త విమానం ల్యాండింగ్‌కు అనుమతి ల‌భించ‌లేదు. గంటపాటు గాలిలో చక్కర్లు కొట్టాల్సి వ‌చ్చింది. చివరకు 5.19 గంటలకు విమానం క్షేమంగా ల్యాండవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement