CM Revanth Reddy | కేసీఆర్‌ను మార్చినట్టే ఇప్పడు విజయన్‌ను మార్చండి: కేరళంలో సీఎం రేవంత్
Election campaign Keralam | పినరయి విజయన్ నాకు రాసిన లేఖలోని తప్పులన్నీ జరగడంతోనే తెలంగాణలో కేసీఆర్‌ను మార్చివేశారని... ఇప్పుడు విజయన్‌ను కూడా కేళరం (Keralam) ప్రజలు మారుస్తారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మోదీ, విజయన్ బంధాన్ని ఇక్కడి ప్రజలు అర్థం చేసుకున్నారని.. ఇక సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
త్రినేత్ర.న్యూస్: పినరయి విజయన్ నాకు రాసిన లేఖలోని తప్పులన్నీ జరగడంతోనే తెలంగాణలో కేసీఆర్‌ను మార్చివేశారని... ఇప్పుడు విజయన్‌ను కూడా కేళరం (Keralam) ప్రజలు మారుస్తారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కేరళంలోని కోవలం (Kovalam) నియోజకవర్గంలో మంగళవారం ఉదయం రేవంత్ ఎన్నికల ప్రచారం (Election campaign) నిర్వహించారు. కేరళం ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. మోదీ, విజయన్ బంధాన్ని ఇక్కడి ప్రజలు అర్థం చేసుకున్నారని.. ఇక సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మార్పు తథ్యం అని పేర్కొన్నారు.
విజయన్ గాడ్ ఫాదర్ ఢిల్లీలో ఉన్నారు..
విజయన్‌పై శబరిమల బంగారం చోరీ, బంగారం స్మగ్లింగ్ కేసులున్నాయి. ఆయన గాడ్ ఫాదర్ నరేంద్ర మోదీ ఢిల్లీలో ఉన్నారు. మోదీనే ఈ కేసులన్నింటి నుంచి విజయన్‌ను రక్షిస్తున్నారు. దేశం కోసం తమ జీవితాలను, ఆస్తులను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని మాత్రం రకరకాల కేసులతో వేధిస్తున్నారు. కేజ్రీవాల్ సహా అనేక మంది నేతలను ఈడీ కేసులతో వేధించారు. అరెస్టులు చేశారు. కానీ విజయన్ జోలికి ఎందుకు రావడం లేదో ఒక్కసారి ఆలోచించాలి. మోదీ, విజయన్ మధ్య ఉన్న అవగాహనతోనే కేసులు, అరెస్టులు లేవు అని రేవంత్ పేర్కొన్నారు.
మంచి జరిగితే అభినందిస్తం..
కేరళంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఘనత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కరుణాకరన్, ఊమెన్ చాందీలది. ఎక్కడైనా మంచి జరిగితే మేం అభినందిస్తాం. పంచాయతీరాజ్ వ్యవస్థ విజయం సాధించింది. దాన్ని మేం అభినందిస్తున్నాం. పినరయి విజయన్ హయాంలోని వైఫల్యాలను ఎత్తి చూపాను. 120 నెలల విజయన్ పాలన వైఫల్యానికి ప్రతీకగా నిలిచింది. ఆయన వైదొలిగే సమయం ఆసన్నమైంది.
ఇక్కడ వృద్ధులు, చిన్న పిల్లలే కనిపిస్తున్నరు..
మూడింట రెండొంతుల మెజారిటీతో మేం గెలవబోతున్నాం. ఊమెన్‌చాందీ తరహా పాలన అందిస్తాం. యువత వలస వెళ్లడంతో వృద్ధులు, చిన్నపిల్లలే కనిపిస్తున్నారు. ఇది దురదృష్టకరం. విద్యావంతులు, నైపుణ్యం ఉన్న యువత విదేశాలకు వెళ్లడం మంచిది కాదు. వాళ్లు ఇక్కడకు వచ్చి ఉపాధి పొందేలా చేస్తాం. తెలంగాణలో మాదిరే అభివృద్ధి.. మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ నియామకాలు, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాం.
విజయన్ సమాధానం ఇవ్వాలి..
విజయన్‌తో పాటు కేరళం కమ్యూనిస్టు మహిళా నాయకులను తెలంగాణకు ఆహ్వానిస్తున్నా. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు మేం చేస్తాం. తెలంగాణలో ఏ మూలకైనా వెళ్లి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించవచ్చు. ఈ విషయంలో నేను విజయన్‌కు సవాల్ చేస్తున్నా. మేం 67 వేల ఉద్యోగాలిచ్చాం. 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన రూ. 20,670 కోట్ల రుణమాఫీ చేశాం. 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. 200 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నం. రూ.500 కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నం. ఎన్నికలు కేరళం, తెలంగాణ మధ్య కాదు.. యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య జరుగుతున్నాయి. మేం ఏం చేస్తున్నామో అది చెబుతున్నాం.. మా సవాళ్లకు విజయన్ సమాధానం ఇవ్వాలి అని రేవంత్ అన్నారు.
తెలంగాణలో 2014-23 మధ్య జరిగిన విషయాలపై విజయన్ నాకు ఓ లేఖ రాశారని గుర్తు చేశారు. అప్పుడు పినరయి సన్నిహిత మిత్రుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. ఆయన లేఖలోని తప్పులన్నీ జరిగినందునే తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను మార్చివేశారని తెలిపారు. ఇప్పుడు విజయన్‌ను కూడా కేరళం ప్రజలు మార్చివేస్తారని జోస్యం చెప్పారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



