త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allu Arjun | ఫొటోతో రూమ‌ర్ల‌కు చెక్ – బ‌న్నీ, లోకేష్ క‌న‌గ‌రాజ్ మూవీ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్‌

అల్లు అర్జున్‌, లోకేష్ క‌న‌గ‌రాజ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న పాన్ ఇండియ‌న్ మూవీ క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా ఆగిపోయిన‌ట్లు గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ రూమ‌ర్ల‌కు లోకేష్ క‌న‌గ‌రాజ్ చెక్ పెట్టాడు. బ‌న్నీతో క‌లిసి దిగిన ఓ ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. త్వ‌ర‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ రానున్నాయ‌ని పేర్కొన్నాడు.

N

News | Published On Oct 12, 2026, 3.42 pm IST

Allu Arjun | ఫొటోతో రూమ‌ర్ల‌కు చెక్ – బ‌న్నీ, లోకేష్ క‌న‌గ‌రాజ్ మూవీ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్‌
Advertisement

Allu Arjun |  ప్ర‌స్తుతం రాకా షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న మూవీకి అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. హాలీవుడ్ స్టాండ‌ర్డ్స్‌లో పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా రాకా తెర‌కెక్కుతోంది. రాకా షూటింగ్ పూర్తికాక‌ముందే కోలీవుడ్ క‌న‌గ‌రాజ్‌తో మ‌రో సినిమాకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ ఏడాదే ఓ స్పెష‌ల్ వీడియోతో ఈ మూవీని అనౌన్స్ చేశారు. బ‌న్నీ కోసం పోలీస్ క‌థ‌ను లోకేష్ క‌న‌గ‌రాజ్ సిద్ధం చేస్తోన్న‌ట్లు వార్త‌లొచ్చాయి.

షూటింగ్ మొద‌లుకాక‌ముందే...

ఈ కోలీవుడ్ డైరెక్ట‌ర్ సిద్ధం చేసిన క‌థ బ‌న్నీకి న‌చ్చ‌లేద‌ని, క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా షూటింగ్ మొద‌లుకాక‌ముందే ఈ సినిమా ఆగిపోయిన‌ట్లు గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్ వ‌ర్గాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ రూమ‌ర్ల‌కు లోకేష్ క‌న‌గ‌రాజ్ ఓ ఫొటోతో పుల్‌స్టాప్ పెట్టాడు.

సీరియ‌స్ డిస్క‌ష‌న్‌...

అల్లు అర్జున్‌తో దిగిన ఓ ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు లోకేష్ క‌న‌గ‌రాజ్‌. ఈ ఫొటోలో బ‌న్నీతో సీరియ‌స్‌గా డిస్క‌ష‌న్ చేస్తూ లోకేష్ క‌న‌గ‌రాజ్ క‌నిపిస్తున్నారు. స్టోరీ సిట్టింగ్‌కు సంబంధించిన ఫొటో ఇద‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ త్వ‌ర‌లోనే రానున్నాయి అంటూ ఈ ఫొటోకు ఓ కామెంట్‌ను జోడించారు లోకేష్ క‌న‌గ‌రాజ్‌.

23వ మూవీ....

సినిమా ఆగిపోయిందంటూ వ‌స్తోన్న పుకార్ల‌కు ఈ ఫొటోతో ఈ కోలీవుడ్ డైరెక్ట‌ర్ క్లారిటీ ఇచ్చాడు. బ‌న్నీ, లోకేష్ క‌న‌గ‌రాజ్ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ డిసెంబ‌ర్ నుంచి మొద‌లుకానున్న‌ట్లు స‌మాచారం. అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న 23వ మూవీ ఇది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది.

పోలీస్ ఆఫీస‌ర్‌...

ఈ సినిమాలో అల్లు అర్జున్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. వాస్త‌వ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు లోకేష్ ఓ క‌థ‌ను సిద్ధం చేసిన‌ట్లు చెబుతోన్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Advertisement
Advertisement