Phule Birth Anniversary | పూలే స్ఫూర్తితో తల రాతను మార్చుకుందాం: మంత్రి వాకిటి శ్రీహరి
Vaakiti Srihari | మహనీయుల జీవితాలను చదివితే భవిష్యత్‌లో ఎలా బతకాలో తెలుస్తుందని.. నేటి యువత వారి ఆశయాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలని మంత్రి వాకిటి శ్రీహరి (Vaakiti Srihari) పిలుపునిచ్చారు. రవీంద్రభారతిలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే (Mahatma Jyothirao Phule) 199వ జయంతి (Birth) వేడుకల్లో శనివారం ఆయన పాల్గొని మాట్లాడారు.
త్రినేత్ర.న్యూస్: మహనీయుల జీవితాలను చదివితే భవిష్యత్‌లో ఎలా బతకాలో తెలుస్తుందని.. నేటి యువత వారి ఆశయాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలని మంత్రి వాకిటి శ్రీహరి (Vaakiti Srihari) పిలుపునిచ్చారు. కులాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని.. ఇంకా వెనుకబడిన వర్గాలను అవమానించే విధానం పోవాలనే ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో దుర్యోధన పాత్ర వేశానని గుర్తు చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్(Hyderabad)లోని రవీంద్రభారతి (Ravindra Bharathi)లో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే (Mahatma Jyothirao Phule) 199వ జయంతి (Birth) వేడుకల్లో శనివారం ఆయన పాల్గొని మాట్లాడారు.
పూలే సంస్కరణలతోనే విద్యా వ్యాప్తి..
అనంతరం మంత్రి వాకిటి మాట్లాడుతూ.. పూలే తీసుకువచ్చిన సంస్కరణలే నేడు విద్యావ్యాప్తికి దోహదపడుతున్నాయని చెప్పారు. 200 సంవత్సరాల క్రితం బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన మహాత్మా జ్యోతిరావు పూలేను నేడు ఆదర్శంగా తీసుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. చదువు ఒక్కటే తలరాతలను మార్చగలదని పూలే విశ్వసించారని గుర్తు చేశారు. పూలే ఆశయ సాధనలో మనమంతా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం కోసం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నామని వాకిటి వివరించారు.
ఈ జయంతి కార్యక్రమానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య, వి.హనుమంతరావు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, బీసీ సంఘాల నేతలు తదితరులు హాజరయ్యారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!
- ●CM Revanth Reddy | 22 ఏలో ప్రభుత్వ భూములు లేకుంటే నిషేధం ఎత్తేస్తాం
- ●CM Revanth Reddy | అబద్ధాల సంఘాలకు కోట్ల రూపాయాలు ఖర్చు : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | దేవుడే వానలు కురిపించిండు.. అఘోర పూజలపై సీఎం రేవంత్ కామెంట్స్

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత

BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్

KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

CM Revanth Reddy | 22 ఏలో ప్రభుత్వ భూములు లేకుంటే నిషేధం ఎత్తేస్తాం






