త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | అరికెపూడి గాంధీ నా జోలికి వ‌స్త‌లేడు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | కూక‌ట్‌ప‌ల్లిలో ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్‌కు శంకుస్థాప‌న సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేశాక గాంధీ నా జోలికి వ‌స్త‌లేడు అని సీఎం అనడంతో.. స‌భా వేదిక‌పై న‌వ్వులు పూశాయి.

S

Telangana | Published On Aug 13, 2026, 7.39 pm IST

CM Revanth Reddy | అరికెపూడి గాంధీ నా జోలికి వ‌స్త‌లేడు : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : కూక‌ట్‌ప‌ల్లిలో ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్‌కు శంకుస్థాప‌న సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేశాక గాంధీ నా జోలికి వ‌స్త‌లేడు అని సీఎం అనడంతో.. స‌భా వేదిక‌పై న‌వ్వులు పూశాయి.

సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క్రియేట్ చేశాం. హైటెక్ సిటీ స‌మీపంలో ఐదు ఎక‌రాల్లో 100 కోట్ల‌తో క‌మిష‌న‌ర్ ఆఫీస‌ను క‌డుతున్నాం. గ‌తంలో మోరీ పోత‌లేదు.. రోడ్డు అయిత‌లేదు.. అది అయిత‌లేదు.. ఇది అయితలేదు అని గాంధీ అంటుండే. కొత్త క‌మిష‌న‌ర్‌ను ఇచ్చిన త‌ర్వాత‌ గాంధీ నా జోలికి వ‌స్త‌లేడు.. ఏద‌న్న ఉంటే అక్క‌డ్నే ప‌ని చేయించుకుంటున్న‌డు.. మంచి జ‌రుగుతుంద‌ని సీఎం అన్నారు.

Advertisement
Advertisement