త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mrunal Thakur | 15 కోట్ల బ‌డ్జెట్ – కోటి క‌లెక్ష‌న్స్ – ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ డిజాస్ట‌ర్ మూవీ

మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ ఆంఖ్ మిచోలీ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప‌దిహేను కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ హిందీ సినిమా థియేట‌ర్ల‌లో కేవ‌లం కోటి వ‌సూళ్ల‌ను మాత్ర‌మే రాబ‌ట్టింది.

N

Entertainment | Published On Nov 2, 2026, 8.27 pm IST

Mrunal Thakur | 15 కోట్ల బ‌డ్జెట్ – కోటి క‌లెక్ష‌న్స్ – ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ డిజాస్ట‌ర్ మూవీ
Advertisement

Mrunal Thakur |  మృణాల్ ఠాకూర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్స్‌లో ఒక‌టిగా ఆంఖ్ మిచోలీ నిలిచింది. 2023లో రిలీజైన ఈ బాలీవుడ్ మూవీలో అభిమ‌న్యు ద‌స్సానీ హీరోగా న‌టించాడు. ప‌ర‌ష్ రావెల్ ఓ కీల‌క పాత్ర పోషించారు. దాదాపు 15 కోట్ల బ‌డ్జెట్‌తో రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో అతిక‌ష్టంగా కోటి రూపాయ‌ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. నిర్మాత‌లు పెట్టిన బ‌డ్జెట్‌లో క‌నీసం ప‌దోవంతు కూడా రాబ‌ట్ట‌లేక‌పోయింది.

రెండేళ్ల త‌ర్వాత‌...

ఈ డిజాస్ట‌ర్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫెయిల్యూర్ ఎఫెక్ట్‌తోనే ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను కొనేందుకు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ముందుకు రాలేదు. మృణాల్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని చివ‌ర‌కు జియో హాట్ స్టార్ ధైర్యం చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

విమ‌ర్శ‌లు...

ఆంఖ్ మిచోలీ సినిమాకు ఉమేష్ శుక్లా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఖిలాండియోన్ కా ఖిలాడీ, ఓ మై గాడ్ వంటి హిట్ చిత్రాల‌కు ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఆంఖ్ మిచోలీపై మోస్తారు అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌నుషుల్లోని శారీర‌క లోపాల‌ను ఉద్దేశించి ఉమేశ్ శుక్లా రాసిన కామెడీపై దారుణంగా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కామెడీ లోపించ‌డం, క‌థ మొత్తం సాగ‌తీత‌గా ఉండ‌టంతో ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

రే చీక‌టి...

న‌వ‌జోత్ సింగ్ ఓ డాక్ట‌ర్‌. అత‌డి కుటుంబ‌స‌భ్యులంద‌రికి ఏదో ఒక లోపం ఉంది. పెద్ద కొడుకుకు చెవులు విన‌బ‌డ‌వు. చిన్న‌కొడుకుకు న‌త్తి ఉంటుంది. కూతురు పారో రేచీక‌టి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటుంది. కూతురికి ఉన్న స‌మ‌స్య‌ను దాచిపెట్టి రోహిత్ ప‌టేల్ అనే గొప్పింటి కుర్రాడితో పెళ్లి ఫిక్స్ చేస్తాడు న‌వ‌జోత్‌. త‌మ కుటుంబం గురించి రోహిత్‌కు తెలియ‌కుండా ఉండేందుకు న‌వ‌జోత్ ఫ్యామిలీ ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డారు? న‌వ‌జోత్ గురించి పారోకు తెలిసిన షాకింగ్ నిజం ఏమిటి? అన్న‌దే ఈ సినిమా మిగిలిన క‌థ‌.

 

ట్యాగ్స్:

Aankh MicholiBollywoodJio HotstarLatest Ott ReleasesMrunal ThakurMrunal Thakur Bollywood MovieRomantic Comedy Movie
Advertisement
Advertisement