Legal notice to KCR | కేసీఆర్ కు లీగల్ నోటీస్.. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలన్న మంత్రి సీతక్క
Legal notice to KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)కు మంత్రి సీతక్క (Seethakka) లీగల్ నోటీసులు (legal Notice) పంపారు. అంగన్వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన ప్రతిష్టకు బీఆర్ఎస్ పార్టీ సోషల్‌మీడియా భంగం కలగజేస్తుందని.. దీనికి కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు.
త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)కు మంత్రి సీతక్క (Seethakka) లీగల్ నోటీసులు (legal Notice) పంపారు. అంగన్వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన ప్రతిష్టకు బీఆర్ఎస్ పార్టీ సోషల్‌మీడియా భంగం కలగజేస్తుందని.. దీనికి కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. 48 గంటల్లో పోస్టులు తొలగించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలకు వెనకాడనని లీగల్ నోటీసులో సీతక్క హెచ్చరించారు.
బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి మాజీ సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు రిజిస్టర్ పోస్టు ద్వారా కేసీఆర్‌కు న్యాయవాది నాగులూరి కృష్ణ కుమార్ ద్వారా లీగల్ నోటీస్ పంపినట్లు సీతక్క వివరించారు.
అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందని సీతక్క తెలిపారు. టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ ఇచ్చామని, ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె నోటీసులో స్పష్టం చేశారు. మొత్తం టెండర్ విలువ రూ. 44 కోట్లే ఉన్నప్పటికీ, అందులో రూ. 30 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం అసంబద్ధం, ఆధారాలు లేని ఆరోపణలని పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
సంబంధిత వార్తలు

Minister Seethakka | మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్.. వడ్డీ లేని రుణపరిమితి రూ.10 లక్షలకు పెంపు: మంత్రి సీతక్క
మే 7, 2026

City Civil Court | ఆ మొబైల్స్ కొనుగోళ్లలో అవినీతి లేదు.. బీఆర్ఎస్ పార్టీకి కోర్టు మొట్టికాయ
మే 6, 2026

Seethakka | రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నబీజేపీ: మంత్రి సీతక్క
ఏప్రిల్ 30, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



