LIK Collections | లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫస్ట్ డే కలెక్షన్స్ – కృతి శెట్టి ఖాతాలో మరో డిజాస్టర్ ఖాయమేనా?
కృతిశెట్టి లేటెస్ట్ మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద డిసపాయింట్ చేసింది. దాదాపు 90 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ మూవీ మొదటి రోజు తెలుగు, తమిళ భాషల్లో కలిపి 6.85 కోట్ల కలెక్షన్స్ మాత్రమే దక్కించుకుంది.
LIK Collections |బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్‌తో టాలీవుడ్‌కు దూరమైన కృతిశెట్టికి కోలీవుడ్‌లోనూ లక్ కలిసిరావడం లేదు. కార్తీ హీరోగా నటించిన వా వాథియర్ మూవీతో తమిళ సినీ పరిశ్రమలోకి తొలి అడుగు వేసింది. యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ శుక్రవారం తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజైంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమాను లేడీ సూపర్ స్టార్ నయనతార నిర్మించింది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
నెగెటివ్ టాక్
పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎట్టకేలకు ఏప్రిల్ 10న మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తొలిరోజే తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా తమిళంలో కాస్త పర్వాలేదనిపించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలుగులో మాత్రం పూర్తిగా తేలిపోయింది. దాదాపు 90 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ మొదటి రోజు తెలుగు, తమిళ భాషల్లో కలిపి కేవలం 6.85 కోట్ల కలెక్షన్స్ మాత్రమే దక్కించుకుంది. శుక్రవారం నాడు ఈ సినిమాకు తమిళంలో 5.45 కోట్ల కలెక్షన్స్ రాగా...తెలుగులో కేవలం కోటి నలభై లక్షల రూపాయల వసూళ్లతో డిసపాయింట్ చేసింది. నెగెటివ్ టాక్ కారణంగా రెండో రోజు కలెక్షన్స్ మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
బ్రేకప్‌కు ఇన్సూరెన్స్....
ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ రొమాంటిక్ సైన్స్‌ఫిక్షన్‌గా దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు తెరకెక్కించారు. 2040లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ పేరుతో బ్రేకప్‌లకు బీమా ఏర్పాటుచేస్తాడు సూర్య. సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన దీమా ఎల్ఐకే యాప్‌కు సబ్‌స్కైబర్‌గా మారుతుంది. అసలు ఫోన్ ఉపయోగించని వాసు...దీమాతో ప్రేమలో పడతాడు. వారి ప్రేమకు ఎల్ఐకే ఎందుకు అడ్డు చెప్పింది. దీమా ప్రేమను వాసు ఎలా దక్కించుకున్నాడనే పాయింట్‌తో విఘ్నేష్ శివన్ ఈ సినిమాను తెరకెక్కించారు. కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉన్న ఆసక్తిగా చెప్పడంలో దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆసక్తికరంగా చెప్పడంలో విఫలమయ్యారంటూ విమర్శలొస్తున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



