Kiran Abbavaram | ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం – పౌరాణిక సినిమాతో పాన్ ఇండియన్ లీగ్‌లోకి ఎంట్రీ!
పాన్ ఇండియన్ లీగ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇంద్రపుత్ర పేరుతో ఓ మైథాలజీ మూవీ చేస్తున్నాడు. శ్రీకాంత్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్‌లో మొదలుకాబోతుంది.
Kiran Abbavaram | ప్రస్తుతం టాలీవుడ్‌లో మైథాలజీ సినిమాలకు ట్రెండ్ నడుస్తోంది. రాజమౌళి వారణాసిలో మహేష్‌బాబు శ్రీరాముడిగా కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ పేరుతో ఓ పౌరాణిక సినిమాను అంగీకరించాడు. వీరితో పాటు మరికొందరు హీరోలు మైథాలజీ కథలతో సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చేరాడు. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఓ మైథాలజీ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు ఇంద్రపుత్ర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. భారతీయ పురాణాలు, ఇతిహాసాల్లోని ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే యుద్ధం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో శ్రీకాంత్ పుప్పాల దర్శకుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు.
మైథాలజీ మూవీ...
మైథాలజీ, యాక్షన్, ఫాంటసీ, ఎమోషనల్ అంశాలతో చాలా గ్రాండియర్‌గా ఈ సినిమా ఉండబోతున్నట్లు నిర్మాత ప్రేరణ అరోరా అన్నారు. తెలుగు ఆడియెన్స్‌కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని పేర్కొన్నారు. గతంలో చేసిన సాఫ్ట్ బాయ్ రోల్స్‌కు పూర్తి విభిన్నంగా ఇందులో కిరణ్ అబ్బవరం కనిపిస్తాడని సమాచారం. పౌరాణిక పాత్రతో పాటు మరో డిఫరెంట్ లుక్‌తో చాలా సర్‌ప్రైజింగ్‌గా అతడి క్యారెక్టర్ సాగుతుందని అంటున్నారు. అక్టోబర్ నుంచి ఇంద్రపుత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతుంది. కీర్తన్ కథను అందిస్తున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తోన్న 15వ సినిమా ఇది.
సుకుమార్ బ్యానర్‌లో...
ఇటీవల రిలీజైన చెన్నై లవ్‌స్టోరీతో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ యాభై కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ప్రస్తుతం సుకుమార్ బ్యానర్‌లో ఓ మూవీతో పాటు తానే దర్శకుడిగా మారి మరో సినిమాను తెరకెక్కిస్తోన్నాడు. గువ్వలచెరువు ఘాట్ పేరుతో ఓ వెబ్‌సిరీస్ కూడా చేస్తున్నాడు.
సంబంధిత వార్తలు

Faria Abdullah | బోనాల వేడుకలో కంటతడి పెట్టిన జాతిరత్నాలు హీరోయిన్ – తెలంగాణ కల్చర్‌కు ఫిదా
ఆగస్టు 10, 2026

Tabu | ఫియర్లెస్…రూత్‌లెస్…ఫస్ట్ టైమ్ మాస్ రోల్లో టబు – స్లమ్ డాగ్ గ్లింప్స్ రిలీజ్
ఆగస్టు 10, 2026

Allu Arjun | వైజాగ్‌లో అల్లు అర్జున్ కొత్త మల్టీప్లెక్స్ గ్రాండ్‌గా లాంఛ్
ఆగస్టు 9, 2026
తాజావార్తలు
- ●van swept away | నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యాన్.. తొమ్మిది మంది మృతి
- ●Lava Smart 4 | రూ.8,499కే లావా స్మార్ట్‌ఫోన్.. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16..
- ●Inflation | 1970ల నాటి ద్రవ్యోల్బణం మళ్లీ రానుందా.. బంగారం ధరలు భారీగా పెరగనున్నాయా..?
- ●Minister Vakiti Srihari | 4.21 లక్షల మంది మత్స్యకారులకు రూ.5లక్షల ప్రమాద బీమా : మంత్రి వాకిటి శ్రీహరి
- ●Faria Abdullah | బోనాల వేడుకలో కంటతడి పెట్టిన జాతిరత్నాలు హీరోయిన్ - తెలంగాణ కల్చర్‌కు ఫిదా
- ●KTR | పెద్ది అంతిమయాత్రకు ఓరుగల్లు మొత్తం కదిలింది.. ఆ చివరి ప్రయాణమే ఆయన జీవితానికి అసలైన కొలమానం

van swept away | నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యాన్.. తొమ్మిది మంది మృతి

Lava Smart 4 | రూ.8,499కే లావా స్మార్ట్‌ఫోన్.. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16..

Inflation | 1970ల నాటి ద్రవ్యోల్బణం మళ్లీ రానుందా.. బంగారం ధరలు భారీగా పెరగనున్నాయా..?

Minister Vakiti Srihari | 4.21 లక్షల మంది మత్స్యకారులకు రూ.5లక్షల ప్రమాద బీమా : మంత్రి వాకిటి శ్రీహరి



