త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGHRC | గిరిజన వసతి గృహ విద్యార్థి మ‌ర‌ణం కేసులో మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ కీలక ఆదేశాలు

TGHRC | గిరిజ‌న వ‌స‌తి గృహంలో విద్యార్థి మ‌ర‌ణించిన కేసులో తెలంగాణ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (TGHRC) ఆ విద్యార్థి కుటుంబాన్ని ఆదుకునేందుకు కీల‌క ఆదేశాలు జారీ చేశారు.

A

News | Published On Dec 12, 2025, 7.08 pm IST

TGHRC | గిరిజన వసతి గృహ విద్యార్థి మ‌ర‌ణం కేసులో మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ కీలక ఆదేశాలు
Advertisement

TGHRC | గిరిజ‌న సంక్షేమ వ‌స‌తి గృహంలో విద్యార్థి మ‌ర‌ణించిన కేసులో తెలంగాణ రాష్ట్ర మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (TGHRC) కీల‌క ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగంతో పాటు రూ.అయిదు ల‌క్ష‌ల ప‌రిహారం అందించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి సిఫార్సు చేసింది. ఈ మేర‌కు క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ జ‌స్టిస్ ష‌మీమ్ అక్త‌ర్ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఖమ్మంలోని గిరిజన సంక్షేమ వసతి గృహంలో చోటుచేసుకున్న 10 సంవత్సరాల దేవత్ జోసెఫ్ మరణం ప్రభుత్వ వసతి గృహ అధికారులు, దాని పర్యవేక్షణ బాధ్యత ఉన్న గిరిజన సంక్షేమ విభాగం అధికారుల తీవ్ర నిర్లక్ష్యం వల్ల జరిగింద‌ని క‌మిష‌న్ నిర్ధారించింది.

మృతి చెందిన బాలుడి తల్లి దివ్యాంగురాల‌ని, బ‌ధిర‌, మూగ మ‌హిళ అని పేర్కొన్నారు. ఆమెపై త‌న కుమార్తెతో పాటు వృద్ధురాలైన అత్త‌ను పోషించాల్సిన బాధ్య‌త ఉంద‌ని గుర్తు చేశారు. ప్ర‌భుత్వం అవ‌స‌ర‌మైన నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించి, రెగ్యుల‌ర్ ఉద్యోగం ఇవ్వాల‌ని, రూ.అయిదు ల‌క్ష‌ల ప‌రిహారం మంజూరు చేయాల‌ని పేర్కొంది. దీనిని మాన‌వ‌తా దృక్ప‌థంతో ప్ర‌జ‌ల మౌళిక హ‌క్కుల‌ను కాపాడే చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. ఈ సిఫార్సులను ఆరు నెలలలోగా అమలు చేసి, అమలు నివేదికను కమిషన్‌కు సమర్పించాల‌ని నిర్దేశించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement