Adinath Kothare | 15 ఏళ్ల దాంపత్యానికి తెర.. విడాకులు తీసుకున్న రామాయణ నటుడు..!
Adinath Kothare | ప్రముఖ నటుడు ఆదినాథ్ కొఠారే తన దాదాపు 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. భార్య ఊర్మిళ కనేట్కర్ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఇద్దరూ సంయుక్తంగా తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Entertainment | Published On Jul 16, 2026, 5.31 pm IST
Adinath Kothare | ప్రముఖ నటుడు ఆదినాథ్ కొఠారే తన దాదాపు 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. భార్య ఊర్మిళ కనేట్కర్ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఇద్దరూ సంయుక్తంగా తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'రామాయణ'లో కీలక పాత్ర పోషిస్తున్న ఆదినాథ్.. సినిమా రిలీజ్‌కు ముందే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన సంయుక్త ప్రకటనలో ఈ నిర్ణయం పరస్పర అంగీకారంతో తీసుకున్నదేనని స్పష్టం చేశారు.
సంయుక్త ప్రకటనలో ఆదినాథ్, ఊర్మిళ మాట్లాడుతూ "ఎన్నో ఆలోచనలు, చర్చల అనంతరం మేమిద్దరం జీవిత భాగస్వాములుగా విడిపోవాలని పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నాం. దంపతులుగా మా ప్రయాణం ముగిసినప్పటికీ మా కుమార్తె జిజాపై ఉన్న బాధ్యత మాత్రం ఎప్పటికీ మారదు. ఆమె ప్రేమతో, భద్రతతో కూడిన వాతావరణంలో ఎదిగేలా ఇద్దరం కలిసి తల్లిదండ్రులుగా మా బాధ్యతను కొనసాగిస్తాం" అని పేర్కొన్నారు. "మేమిద్దరం ఒకరినొకరు గౌరవిస్తూనే కలిసి గడిపిన కాలాన్ని ఎంతో విలువైనవిగా భావిస్తున్నాం. ఇన్నేళ్లుగా మాపై చూపిన ప్రేమ, ఆదరణకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మా జీవితంలో ప్రారంభమవుతున్న ఈ కొత్త అధ్యాయంలోనూ మీ ఆశీర్వాదాలు ఉంటాయని ఆశిస్తున్నాం. అలాగే మా వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ విషయంపై మేం విడుదల చేస్తున్న ఏకైక ప్రకటన ఇదే. ఇకపై దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోము" అని పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mahaprabhu Jagannath | మహాప్రభు జగన్నాథ్ మూవీ రిలీజ్‌పై సుప్రీంకోర్టుకు మేకర్స్
జులై 16, 2026

Deepika Padukone | సోనమ్ వాంగ్చుక్కు దీపికా పడుకోణ్ మద్దతు – సోషల్ మీడియాలో రచ్చ – అసలు ట్విస్ట్ ఇదే?
జులై 16, 2026

CPP Meeting | పార్లమెంట్ వేదికగా ప్రజల గళం వినిపించనున్న కాంగ్రెస్
జులై 16, 2026
తాజావార్తలు
- ●Harish Rao | అప్రకటిత కరెంట్ కోతలతో.. తెలంగాణలో అంధకారం
- ●Jagannath Rath Yatra | పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి.. తొక్కిసలాట జరిగి ఒకరు మృతి, 200 మందికి గాయాలు
- ●Sreeleela | శ్రీలీలను రిజెక్ట్ చేస్తున్న హీరోలు - ధమాకా బ్యూటీని వెంటాడుతోన్న బ్యాడ్ లక్
- ●OnePlus | ఆక్సిజన్ ఓఎస్‌కు గుడ్‌బై.. వన్‌ప్లస్ ఫోన్లలో ఇక కలర్ఓఎస్, ఇండియా నుంచి ఎగ్జిట్ పై కూడా క్లారిటీ..
- ●Bhadradri Kothagudem | నిల్చుండగానే గర్భిణి ప్రసవం.. నేలపై జారిపడిన శిశువుకు తీవ్ర గాయం
- ●Koel Mallick | దీదీకి షాక్.. రాజీనామా చేసిన మరో ఎంపీ

Harish Rao | అప్రకటిత కరెంట్ కోతలతో.. తెలంగాణలో అంధకారం

Jagannath Rath Yatra | పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి.. తొక్కిసలాట జరిగి ఒకరు మృతి, 200 మందికి గాయాలు

Sreeleela | శ్రీలీలను రిజెక్ట్ చేస్తున్న హీరోలు - ధమాకా బ్యూటీని వెంటాడుతోన్న బ్యాడ్ లక్

OnePlus | ఆక్సిజన్ ఓఎస్‌కు గుడ్‌బై.. వన్‌ప్లస్ ఫోన్లలో ఇక కలర్ఓఎస్, ఇండియా నుంచి ఎగ్జిట్ పై కూడా క్లారిటీ..



