త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

National Awards | నేష‌న‌ల్ అవార్డుల్లో స‌త్తా చాటిన పుష్ప 2, క‌ల్కి – టాలీవుడ్‌కే అత్య‌ధిక పుర‌స్కారాలు

72వ నేష‌న‌ల్ అవార్డుల్లో తెలుగు సినిమాలు మెరిశాయి. ప్ర‌భాస్ క‌ల్కి బెస్ట్ పాపులర్ మూవీగా నిలవగా, అల్లు అర్జున్ పుష్ప 2కు డైరెక్టర్ సుకుమార్‌కు బెస్ట్ స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా అవార్డు ద‌క్కింది . 35 చిన్న క‌థ కాదుతో క‌మిటీ కుర్రాళ్లు సినిమాలు కూడా రెండేసి అవార్డుల‌తో స‌త్తా చాటాయి.

N

Entertainment | Published On Jul 18, 2026, 6.36 pm IST

National Awards | నేష‌న‌ల్ అవార్డుల్లో స‌త్తా చాటిన పుష్ప 2, క‌ల్కి – టాలీవుడ్‌కే అత్య‌ధిక పుర‌స్కారాలు
Advertisement

National Awards |72వ జాతీయ అవార్డుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం శ‌నివారం ప్ర‌క‌టించింది. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు స‌త్తా చాటాయి. ప్ర‌భాస్ క‌ల్కి, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాల‌కు అవార్డుల పంట పండింది. డైరెక్టర్లు సుకుమార్‌, వెంకీ అట్లూరితో పాటు ప‌లువురు సాంకేతిక నిపుణులు అవార్డుల‌ను గెలుచుకున్నారు.

మెగా డాట‌ర్ సినిమా...

బెస్ట్ తెలుగు మూవీగా మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల నిర్మించిన క‌మిటీ కుర్రాళ్లు జాతీయ అవార్డును గెలుచుకుంది. బెస్ట్ మూవీగానే కాకుండా మేక‌ప్ విభాగంలో కూడా ఈ సినిమా అవార్డును ద‌క్కించుకుంది. బెస్ట్ మేక‌ప్ మెన్‌గా పీ ర‌వి కుమార్‌కు అవార్డును ప్ర‌క‌టించారు.

సుకుమార్‌కు అవార్డ్‌...

అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ రెండు విభాగాల్లో నేష‌న‌ల్ అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్ స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా సుకుమార్ అవార్డుకు ఎంపిక‌య్యారు. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా దీపాళి నూర్‌, షీత‌ల్ శ‌ర్మ అవార్డు వ‌చ్చింది. ప్ర‌భాస్ క‌ల్కి మూవీ బెస్ట్ పాపుల‌ర్ ఫిల్మ్‌గా నిలిచింది. ఈ సినిమాకుగాను నితిన్ జిహానీకి బెస్ట్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ విభాగంలో అవార్డును సొంతం చేసుకున్నారు.

ల‌క్కీ భాస్క‌ర్‌....

దుల్క‌ర్ స‌ల్మాన్ ల‌క్కీ భాస్క‌ర్ సినిమాకుగాను వెంకీ అట్లూరి బెస్ట్ డైలాగ్ రైట‌ర్‌గా జాతీయ అవార్డుకు ఎంపిక‌య్యారు. బెస్ట్ చిల్డ్ర‌న్ మూవీ విభాగంలో 35 చిన్న క‌థ కాదు సినిమాకు అవార్డు ద‌క్కింది. ఇదే సినిమాకు గానుబెస్ట్ చైల్డ్ యాక్ట‌ర్ (అరుణ్ దేవ్ పోతుల‌) జాతీయ పుర‌స్కారంతో స‌త్తా చాటారు.

ఇద్ద‌రికీ అవార్డ్‌....

బెస్ట్ హీరోగా ఈ ఏడాది ఇద్ద‌రు హీరోలు అవార్డుల‌ను గెలుచుకున్నారు. మ‌మ్ముట్టి (భ‌మ‌యుగం), కార్తీక్ ఆర్య‌న్ (చందూ ఛాంపియ‌న్‌) సంయుక్తంగా అవార్డును అందుకున్నారు. బెస్ట్ మూవీగా హిందీ మూవీ ఆర్టిక‌ల్ 370 నిలిచింది. ఉత్త‌మ న‌టిగా ఆర్టిక‌ల్ 370గాను యామీ గౌత‌మ్ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.

Advertisement
Advertisement