Thalapathy Vijay | డైరెక్టర్ …లిరిక్ రైటర్…డ్యాన్సర్ – మల్టీ టాలెంటెడ్‌గా దళపతి విజయ్ కొడుకు – సిగ్మా ఫస్ట్ సింగిల్ రిలీజ్
దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న సిగ్మా మూవీ ఫస్ట్ సింగిల్ గురువారం రిలీజైంది. సిగ్మా స్టైల్ అంటూ సాగిన ఈ పాటకు జేసన్ సంజయ్ లిరిక్స్ అందించాడు. ఈ పాటలో హీరోహీరోయిన్లు సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లాతో కలిసి జేసన్ సంజయ్ కూడా నటించాడు.
Thalapathy Vijay |తమిళనాడు సీఎం దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ సిగ్మా మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్నారు. తెలుగు, తమిళ భాషల్లో జూలై 31న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
ఫస్ట్ సింగిల్...
సిగ్మా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను గురువారం మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు. సిగ్మా స్టైల్ అంటూ సాగిన ఈ పాటకు జేసన్ సంజయ్ లిరిక్స్ అందించాడు. తమన్ మ్యూజిక్ సమకూర్చుతూ ఈ పాటను ఆలపించాడు. మాస్ బీట్‌తో సాగిన ఈ పాటలో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, తమన్‌తో పాటు జేసన్ సంజయ్ కూడా కనిపించాడు. తన స్టెప్పులతో అదరగొట్టాడు. సిగ్మా స్టైల్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లిరిక్ రైటర్‌గా...
సిగ్మా మూవీకి డైరెక్టర్‌గా, లిరిక్ రైటర్‌గానే కాకుండా ఈ సాంగ్‌లో స్పెషల్ అప్పిరియెన్స్ ఇచ్చిన జేసన్ సంజయ్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు, మల్టీ టాలెంటెడ్ అంటూ కామెంట్లు పెడుతోన్నారు.
నెట్‌ఫ్లిక్స్...
సిగ్మా మూవీని లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Thalapathy Vijay | దళపతి విజయ్ కొడుకు డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ – తనయుడి సినిమాకు తమిళనాడు సీఎం సపోర్ట్ చేస్తారా?
మే 29, 2026

A. R. Rahman | వామ్మో అన్ని కోట్లా.?…చిరంజీవి సినిమా కోసం ఏఆర్ రెహమాన్ షాకింగ్ రెమ్యూనరేషన్
ఏప్రిల్ 21, 2026

Sundeep Kishan | నితిన్‌తో అనుకొని సందీప్‌కిషన్‌తో అనౌన్స్ – పవర్ పేట పోస్టర్ రిలీజ్
ఏప్రిల్ 16, 2026
తాజావార్తలు
- ●Richest Chief Ministers in India | దేశంలో టాప్ 10 ధనిక సీఎంలు వీరే: చంద్రబాబు, రేవంత్ రెడ్డి ర్యాంకులు ఎంతంటే?
- ●Dev Ji | లాసెట్ ఫలితాల్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ
- ●CM Revanth Reddy | జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పనులు పరిశీలన.. లఘు చిత్రాన్ని వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి
- ●Cockroach Janta Party | జస్ట్ సోషల్ మీడియా డ్రామా కాదు.. రోడ్డెక్కుతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ', ఆ ముగ్గురు ఫేమస్ వ్యక్తులకు కీలక బాధ్యతలు!
- ●Fake Chocolate factory Hyderabad | ఎక్స్పైరీ అయిన రసాయనాలతో చాక్లెట్ల తయారీ.. సీతారాంబాగ్‌లో ఫ్యాక్టరీ సీజ్!
- ●Pooja Hegde | రెమ్యూనరేషన్లో మృణాల్ ఠాకూర్‌ను దాటేసిన పూజా హెగ్డే

Richest Chief Ministers in India | దేశంలో టాప్ 10 ధనిక సీఎంలు వీరే: చంద్రబాబు, రేవంత్ రెడ్డి ర్యాంకులు ఎంతంటే?

Dev Ji | లాసెట్ ఫలితాల్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ

CM Revanth Reddy | జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పనులు పరిశీలన.. లఘు చిత్రాన్ని వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి

Cockroach Janta Party | జస్ట్ సోషల్ మీడియా డ్రామా కాదు.. రోడ్డెక్కుతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ', ఆ ముగ్గురు ఫేమస్ వ్యక్తులకు కీలక బాధ్యతలు!



