Kollywood | హీరోగా ఉదయనిధి స్టాలిన్ కొడుకు – దళపతి విజయ్ తనయుడికి పోటీగా!
దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్‌కి పోటీగా కోలీవుడ్‌లోకి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. డీఎంకే అధినేత, ఉధయనిధి స్టాలిన్ కొడుకు ఇన్బనిధి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. అతడి డెబ్యూ మూవీకి కర్ణన్, మా మన్నన్ సినిమాల ఫేమ్ మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించబోతున్నాడు.
Entertainment | Published On Nov 19, 2026, 3.03 pm IST
Kollywood | తమిళనాడు సీఎం దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ ఈ ఏడాదే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. సిగ్మా సినిమాతో డైరెక్టర్‌గా మారాడు. సందీప్ కిషన్ హీరోగా భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. సిగ్మా ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా డైరెక్టర్‌గా, హీరోగా జాసన్ సంజయ్‌కు ఆఫర్లు వస్తున్నాయి.
తాజాగా జాసన్ సంజయ్‌కి పోటీగా డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ఫ్యామిలీ నుంచి కూడా ఓ వారసుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఉదయనిధి స్టాలిన్ కొడుకు ఇన్బనిధి కథానాయకుడిగా వచ్చే ఏడాది కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
నిర్మాణ సంస్థ...
ఇన్బనిధి ప్రస్తుతం తండ్రి ఉదయనిధి స్టాలిన్ నెలకొల్పిన రెడ్ జాయింట్ మూవీస్ నిర్మాణ సంస్థ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఈ ప్రొడక్షన్ హౌజ్‌కు సీఈవోగా కొనసాగుతోన్నాడు. మరోవైపు తండ్రితో కలిసి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
టీవీకే ప్రభుత్వ పనితీరు....
తాజాగా ఇన్బనిధి సినిమాల్లోకి అరంగేట్రం చేయబోతున్నాడు. అతడు హీరోగా మారిసెల్వరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. సామాజిక ఇతివృత్తానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ మూవీ రూపొందనున్నట్లు సమాచారం. సమకాలీన రాజకీయాల ప్రస్తావన ఈ సినిమాలో ఉండబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అధికార టీవీ ప్రభుత్వ పాలనలోని లోపాలను సినిమాలో చర్చించబోతున్నట్లు సమాచారం. జనవరిలో ఇన్బనిధి, మారి సెల్వరాజ్ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్‌కి పోటీగానే ఇన్బనిధి కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు






